వరుస ప్లాపులు.. అయినా ఈ హీరోయిన్ డిమాండ్ తగ్గట్లేదుగా..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగులో ఇప్పుడిప్పుడే మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్న హీరోయిన్లలో భాగ్యశ్రీ ఒకరు. మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయినా ఈ బ్యూటీ గ్లామర్, నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో నటించింది.
విజయ్ దేవరకొండతో కలిసి కింగ్డమ్ మూవీలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈమూవీ పర్వాలేదనిపించుకుంది. కానీ మరోసారి భాగ్యశ్రీ గ్లామర్ తో కట్టిపడేసింది.
వరుస ప్లాపులతో సతమతమవుతున్న భాగ్య శ్రీకి మరో ఛాన్స్ ఇచ్చింది కాంత సినిమా. ఈ సినిమాలో ఆమె బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. కానీ ఈ మూవీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది.
నటిగా అందం, అభినయంతో రాణిస్తున్నప్పటికీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. ఇటీవలే రామ్ పోతినేని జోడిగా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రిలీజ్ అయ్యింది.
ఇందులో భాగ్య శ్రీ తన లుక్స్ తోపాటు నటనతోనూ ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా హిట్ టాక్ అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో భాగ్య శ్రీకి అంతగా క్రేజ్ మాత్రం రాలేదు.
ఇప్పటివరకు నటించిన నాలుగు సినిమా అంతంత మాత్రంగానే సాగాయి. ఇప్పుడు అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న లెనిన్ చిత్రంలో ఈ బ్యూటీ కథానాయికగా నటిస్తుంది.
తాజాగా ఈ అమ్మడుకు మరో ఛాన్స్ వచ్చిందట. మైత్రి బ్యానర్ లో రాబోయే కొత్త సినిమాకు ఈ బ్యూటీని ఎంపిక చేశారట. అయితే ఇందులో హీరో ఎవరనేది తెలియరాలేదు.