ఇండిగో విమానాల రద్దు కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నై, బెంగళూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం వంటి నగరాలకు స్లీపర్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలు ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.