07 December 2025

బుట్టబొమ్మ తగ్గట్లేదుగా.. పూజా ఆస్తులు, లగ్జరీ లైఫ్ స్టైల్ తెలిస్తే.

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు పూజా హెగ్డే. తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో కలిసి ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

 కానీ కొన్నాళ్లుగా బుట్టబొమ్మకు కలిసి రావడం లేదు. సౌత్ తోపాటు నార్త్ ఇండస్ట్రీలోనూ ఆమె నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో సైలెంట్ అయ్యింది పూజా.

పూజా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఉన్న 3 బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్ లో నివసిస్తుంది. దీని విలువ రూ.6 కోట్లు.

 అలాగే ఆమెకు హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లోనూ సొంతంగా ఇళ్లు ఉన్నట్లు సమాచారం. అలాగే ఆమె ఫ్యాషన్, కాస్మోటిక్స్ బ్రాండ్ ప్రమోషన్లకు భారీగానే వసూలు చేస్తుందట.

పూజా వద్ద రేంజ్ రోవర్ వోగ్, పోర్స్చే కయెన్, ఆడి Q7, జాగ్వార్ , BMW 5-సిరీస్ సెడాన్ వంటి లగ్జరీ  కార్లు ఉన్నాయట. ఆమెకు ఆటో మొబైల్స్ పై ఆసక్తి ఎక్కువట.

నివేదికల ప్రకారం పూజా హెగ్డే ఆస్తులు రూ.50 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. నెలకు దాదాపు రూ. 50 లక్షల ఆదాయం వస్తుంది. సినిమాలు, ప్రకటనల ద్వారా సంపాదిస్తుంది. 

 ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 27 మిలియన్లకు పైగా  ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే పూజా హెగ్డే ప్రతి ఎండార్స్‌మెంట్‌కు దాదాపు రూ. 40 లక్షలు సంపాదిస్తున్నట్లు సమాచారం.

 పూజా హెగ్డే కొన్నాళ్లుగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఆమె నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవుతున్నాయి. నెట్టింట మాత్రం ఏదోక పోస్ట్ చేస్తుంది.