రోహింగ్యాల అదృశ్యంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను విచారించిన చీఫ్ జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్, అక్రమ చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ వేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ అంతర్గత భద్రత, స్థానిక పేదల హక్కులకు ఇది విఘాతం అని స్పష్టం చేశారు. అక్రమంగా ప్రవేశించి భారతీయ గుర్తింపు కార్డులు పొందడాన్ని, సబ్సిడీలను పొందడాన్ని ఆయన ఖండించారు.