Allu Arjun: మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్.. అల్లు అర్జున్‏ అరెస్ట్ పై మంచు మనోజ్ రియాక్షన్..

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీ.. ఆ తర్వాత తన నివాసానికి చేరుకున్నారు. ఆయనను పరామర్శించేందుకు సినీతారలు బన్నీ ఇంటికి క్యూ కట్టారు.

Allu Arjun: మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్.. అల్లు అర్జున్‏ అరెస్ట్ పై మంచు మనోజ్ రియాక్షన్..
Manchu Manoj, Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 15, 2024 | 9:31 AM

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్‏ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రంతా జైలులో ఉన్న బన్నీ శనివారం ఉదయం విడుదలయ్యారు. జైలు నుంచి తన నివాసానికి వెళ్లిన బన్నీ పరామర్శించేందుకు సినీ ప్రముఖులు, హీరోస్ ఆయన నివాసానికి క్యూ కట్టారు. బన్నీని చూసి డైరెక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి సతీమణి, బన్నీ మేనత్త సురేఖ భావోద్వేగానికి గురయ్యారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అల్లు అర్జున్ ను ఎంతో మంది పరామర్శిస్తున్నారు. పలువురు బన్నీ ఇంటికి వెళ్లగా.. మరికొందరు ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడారు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కు మద్దతు తెలిపారు మంచు మనోజ్.

బన్నీ అరెస్ట్ అయిన విషయంపై మంచు మనోజ్ సోషల్ మీడియాలో స్పందించారు. “మొత్తం దిష్టి పోయింది బాబాయ్. తిరిగి స్వాగతం. ఇటువంటి క్లిష్ట సమయంలో మీరు మీ బాధ్యతను మరువలేదు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో మీ స్పందన గొప్పది. సంఘటన జరిగిన వెంటనే మీ స్పందన మీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన హృదయ విదారకరమైనది. ఇక మీదట ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండే విధంగా ఆ సంఘటన రిమైండర్ గా పని చేస్తుందని భావిస్తున్నాను. మీకు మీ కుటుంబానికి శాంతి, సంతోషం చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

అరెస్ట్ అయి దాదాపు 12 గంటలు చంచల్ గూడా జైలులో ఉన్నారు అల్లు అర్జున్. అనంతరం శనివారం ఉదయం విడుదలై ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ను చూసి కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇక నిన్న ఉదయం నుంచి బన్నీ ఇంటికి సినీతారలు క్యూ కట్టారు. రానా దగ్గుబాటి, నాగచైతన్య, డైరెక్టర్ సుకుమార్, విజయ్ దేవరకొండ, సుధీర్ బాబు, దర్శకులు రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, బోయపాటి శ్రీను, నిర్మాత దిల్ రాజు, హీరో వెంకటేశ్, శర్వానంద్, అఖిల్, కన్నడ హీరో ఉపేంద్ర, సుడిగాలి సుధీర్, జీవితా రాజేశేఖర్, ఆకాశ్ పూరి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు బన్నీని కలిసి పరామర్శించారు.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.