కృష్ణా జిల్లా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జంగారెడ్డిగూడెం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న ఐదుగురు ప్రయాణికులు బాపులపాడు మండలం వీరవల్లి వద్ద ఈ ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. అప్రమత్తమైన ప్రయాణికులు కారు నుంచి వెంటనే దిగి సురక్షితంగా బయటపడ్డారు.