ఖమ్మం జిల్లా సత్తుపల్లి అర్బన్ పార్క్లో జింకల వేట కేసులో అటవీ శాఖ అధికారులు నలుగురిని అరెస్టు చేశారు. BRS మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు రఘు, కుంజా భరత్ ఇందులో నిందితులుగా ఉన్నారు. విచారణలో వీరు జింకలు, దుప్పులను వేటాడినట్లు, అనంతరం మాంసంతో విందు చేసుకున్నట్లు తేలింది.