Nagababu: ఏపీ కేబినెట్‌లో నాగబాబుకు ఆ శాఖే ఇస్తారట.! వీడియో..
జనసేన నాయకుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏపీ కేబినెట్‌లో చోటు లభించింది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఏ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖను కూటమి ప్రభుత్వం అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన పార్టీ నేత కందుల దుర్గేశ్ ఈ శాఖను నిర్వర్తిస్తున్నారు. దీంతోపాటు టూరిజం శాఖ కూడా దుర్గేశ్ వద్దే ఉంది. అయితే, దుర్గేశ్ నుంచి సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు అప్పగించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దుర్గేశ్ సొంత పార్టీ నేతే కావడంతో ఆయన నుంచి ఈ శాఖను నాగబాబుకు బదిలీ చేయడం సులభతరం అవుతుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చిత్రపరిశ్రమకు చెందిన నాగబాబుకు ఈశాఖ కేటాయించడం వల్ల ఇటు ఇండస్ట్రీ, అటు ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటారని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో గనుల శాఖ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ అంశంపై మరో రెండు లేదా మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.