Health: భోజ‌నం చేసేట‌ప్పుడు నీళ్లు తాగితే ఏమౌతుంది.? వీడియో..

Health: భోజ‌నం చేసేట‌ప్పుడు నీళ్లు తాగితే ఏమౌతుంది.? వీడియో..

Anil kumar poka

|

Updated on: Dec 14, 2024 | 3:49 PM

భోజ‌నం చేసేట‌ప్పుడు నీళ్లు తాగాలా.. వద్దా.. తాగితే ఎన్ని నీళ్లు తాగాలి? ఒకవేళ తాగ‌వ‌ద్దు అనుకుంటే ఎందుకు తాగొద్దు? ఇలాంటి డౌటనుమానాలు అనేకం పలువురిని వేధిస్తూనే ఉంటాయి. ఆహారం తీసుకునేటప్పుడు నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాద‌ని, అజీర్తి, గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని అంటుంటారు. అయితే కొంద‌రు మాత్రం భోజ‌నం చేసేట‌ప్పుడు నీళ్ల‌ను తాగితేనే మంచిద‌ని, ఇది ఆహారంతో స‌రిగ్గా క‌లుస్తుంద‌ని, ఆహారం సుల‌భంగా జీర్ణం అయ్యేందుకు నీళ్లు ఎంత‌గానో ఉపయోగప‌డతాయ‌ని అంటుంటారు.

భోజ‌నం చేసేట‌ప్పుడు నీళ్ల‌ను తాగితేనే మంచిద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. దీంతో మ‌నం తిన్న ఆహారం సుల‌భంగా పేగుల్లో క‌దులుతుంది. దీని వ‌ల్ల ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా గ్రహిస్తుంది. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండదు. అయితే భోజ‌నం చేసేట‌ప్పుడు మ‌రీ ఎక్కువ నీటిని తాగ‌కూడ‌దు. అర గ్లాసు నీళ్ల‌ను మాత్ర‌మే తాగాల‌ని అంటున్నారు నిపుణులు. దీని వ‌ల్ల మ‌నం తినే ఆహారం పేగుల్లో సుల‌భంగా క‌దులుతుంది. అలాగే గొంతు ప‌ట్టేయ‌కుండా ఉంటుంది. కాస్త నీటిని తాగితే ఫ‌ర్వాలేదు. జీర్ణాశ‌యం అందుకు అనుగుణంగా ఆమ్లాల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. అయితే ఎక్కువ నీటిని మాత్రం తాగ‌కూడ‌దు. అలా చేస్తే క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయని చెబుతున్నారు. ఇక భోజ‌నం చేయ‌డానికి 30 నిమిషాల ముందు నీళ్ల‌ను తాగితే మంచిద‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అయితే చాలా మంది భోజ‌నం చేసే స‌మ‌యంలో కూల్ డ్రింక్స్‌, సోడా వంటి పానీయాల‌ను సేవిస్తుంటారు. భోజ‌నం చేసే స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తాగ‌రాదు. ఇవి జీర్ణ క్రియ‌కు ఆటంకం క‌లిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరానికి అందకుండా చేస్తాయి. దీంతో మ‌న‌కు పోష‌కాలు స‌రిగ్గా ల‌భించ‌వు. అలాగే మ‌నం తినే ఆహారం కూడా స‌రిగ్గా జీర్ణం కాదు. ఫ‌లితంగా అది శ‌రీరంలో కొవ్వుగా పేరుకుపోతుంది. ఇది బ‌రువును పెంచుతుంది. క‌నుక భోజ‌నం చేసేట‌ప్పుడు సోడాలు, కూల్ డ్రింక్స్ తాగ‌క‌పోవ‌డ‌మే మంచిదని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.