Horoscope Today: వారికి పని భారం, మానసిక ఒత్తిడి.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (10 December 2024): మేష రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. మిథున రాశి వారికి వ్యాపారాల్లో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి పని భారం, మానసిక ఒత్తిడి.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 10th December 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 10, 2024 | 5:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 10, 2024): మేష రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. మిథున రాశి వారికి వ్యాపారాల్లో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. అధికా రులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. కుటుంబపరంగా రోజంతా ఉత్సాహంగా గడిచిపో తుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. బంధువుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు కలుగు తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సమ స్యలు చాలావరకు తగ్గే అవకాశం ఉంది. బంధువుల సహకారంతో మంచి పెళ్లి సంబంధం కుదు రుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి, జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ప్రయాణాల్లో డబ్బు గానీ, విలువైన వస్తువులను గానీ పోగొట్టుకునే అవ కాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశముంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. విశ్రాంతి కరువవుతుంది. ఇంటా బయటా కూడా బాధ్యతలపరంగా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీలు ఉండవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఆశించిన సమాచారం అందవచ్చు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవ కాశం ఉంది. బంధువులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారంలో కొన్ని కీలక మార్పులు చేపడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ )

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వంటి వృత్తుల వారికి రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెడ తారు. నిరుద్యోగులు ఉద్యోగంలో చేరే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన బాగా పెరిగే సూచనలున్నాయి. కుటుంబానికి సంబంధించి ఆశించిన శుభ వార్తలు వింటారు. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. డబ్బు ఇవ్వాల్సినవారు తిరిగి ఇస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలో శుభ వార్తలు వింటారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన బాధ్యతలను సహోద్యోగుల కంటే సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ పరంగా కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటుతో వ్యవహరించవద్దు. బంధు మిత్రులతో నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరి ష్కారం అవుతుంది. అదనపు ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పని భారం, అదనపు బాధ్యతల వల్ల మానసిక ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా సహనంతో వ్యవ హరించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం సంతృప్తికరమైన స్థాయిలో ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధి లోకి వస్తారు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆశించిన ఆద రణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. కానీ, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. పిల్లల నుంచి ఆశిం చిన శుభ వార్తలు వింటారు. ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. బంధు మిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. సొంత పనుల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది.

ఆ 8 నోటిఫికేషన్లకు ఉమ్మడిగా ఒకే జనరల్‌ స్టడీస్‌ పరీక్ష.. APPSC
ఆ 8 నోటిఫికేషన్లకు ఉమ్మడిగా ఒకే జనరల్‌ స్టడీస్‌ పరీక్ష.. APPSC
ఏపీలోని ఈ మగాళ్ల పండగ గురించి మీకు తెల్సా..?
ఏపీలోని ఈ మగాళ్ల పండగ గురించి మీకు తెల్సా..?
డాకు మహారాజ్‌గా బాలయ్య అరాచకం.. పక్కా కమర్షియల్ పండుగ సినిమా
డాకు మహారాజ్‌గా బాలయ్య అరాచకం.. పక్కా కమర్షియల్ పండుగ సినిమా
ఈసారి ఆన్‌లైన్‌లోనే నీట్‌ యూజీ 2025 పరీక్ష..!
ఈసారి ఆన్‌లైన్‌లోనే నీట్‌ యూజీ 2025 పరీక్ష..!
బర్రె కోసం సీసీ కెమెరా ఫుటేజ్ చూసి షాక్ అయిన పోలీసులు
బర్రె కోసం సీసీ కెమెరా ఫుటేజ్ చూసి షాక్ అయిన పోలీసులు
వీటిని ఎలా తింటారురా.! పండక్కి వస్తే పైలోకానికే పార్శిల్ చేసేలా..
వీటిని ఎలా తింటారురా.! పండక్కి వస్తే పైలోకానికే పార్శిల్ చేసేలా..
UNO నిపుణుల కమిటీలో సభ్యత్వం పొందిన భారత్.. కేంద్రం వెల్లడి
UNO నిపుణుల కమిటీలో సభ్యత్వం పొందిన భారత్.. కేంద్రం వెల్లడి
మహాకుంభమేళా ద్వారా రూ.2లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం
మహాకుంభమేళా ద్వారా రూ.2లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం
వామ్మో.. రూ.36000 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం..ఎలా తగలబెట్టారంటే
వామ్మో.. రూ.36000 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం..ఎలా తగలబెట్టారంటే
సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌
సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌