- Telugu News Photo Gallery Spiritual photos Two maha yogas these zodiac signs to get benefitted in big way details in telugu
Zodiac Signs: రెండు మహా యోగాలు.. ఆ రాశుల వారికి అత్యధిక ప్రయోజనం
గజకేసరి, బుధాదిత్య యోగాలు ఒకదానినొకటి వీక్షించడం వల్ల కొన్ని రాశులకు విపరీత రాజయోగాలు, మహా భాగ్య యోగాలు కలగబోతున్నాయి. ఈ నెల 14, 15, 16 తేదీల్లో మూడు రోజులు అత్యంత శుభ దినాలయినందువల్ల, ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు అత్యంత శుభఫలితాలనిస్తాయి.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Dec 08, 2024 | 12:59 PM

ఈ నెల (డిసెంబర్) 14, 15, 16 తేదీల్లో రెండు మహా యోగాలు ఏర్పడడంతో పాటు, అవి ఒకదానినొకటి వీక్షించుకోవడం జరుగుతోంది. ఈ నెల 14న వృషభ రాశిలో ఉచ్ఛపడుతున్న చంద్రుడు అదే రాశిలో గురువుతో యుతి చెందడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతోంది. దానికి సప్తమ స్థానంలో ఇప్పటికే ఏర్పడిన బుధాదిత్య యోగాన్ని అది వీక్షించడం జరుగుతోంది. గజకేసరి, బుధాదిత్య యోగాలు ఒకదానినొకటి వీక్షించడం వల్ల కొన్ని రాశులకు విపరీత రాజయోగాలు, మహా భాగ్య యోగాలు కలగబోతున్నాయి. ఈ మూడు రోజులు అత్యంత శుభ దినాలు అయినందువల్ల, ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు అత్యంత శుభఫలితాలనిస్తాయి. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశులు ఈ యోగాల వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందడం జరుగుతుంది.

వృషభం: ఈ రాశిలో గజకేసరి యోగం ఏర్పడడంతో పాటు సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో అత్యధిక లాభాలు కలుగు తాయి. వృత్తి, వ్యాపారాలు విశేషమైన పురోగతి సాధిస్తాయి. ఉద్యోగంలో ఊహించని పదోన్నతులు కలుగుతాయి. ముఖ్యమైన శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుం బంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి పంచమ, లాభ స్థానాల్లో బుధాదిత్య, గజకేసరి యోగాలు ఏర్పడుతున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు కలగడంతో పాటు, ఆదాయపరంగా మహా భాగ్య యోగం కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. నిరు ద్యోగులకు అనేక అవకాశాలు అందివస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకా శాలున్నాయి. సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత వర్గాలతో సంబంధాలు ఏర్పడతాయి.

సింహం: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల్లో ఈ రెండు మహా యోగాలు ఏర్పడుతున్నందువల్ల ఉద్యోగ జీవి తంలో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశముంది.

వృశ్చికం: ఈ రాశిలో ఏర్పడిన బుధాదిత్య యోగానికి, సప్తమంలో ఉన్న గజకేసరి యోగానికి శుభ వీక్షణ ఏర్పడినందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. సామాజికంగా కూడా స్థాయి, హోదాలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఇంట్లో సుఖ సంతో షాలు నెలకొంటాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.

మకరం: ఈ రాశికి పంచమ, లాభస్థానాల్లో గజకేసరి, బుధాదిత్య యోగాలు ఏర్పడినందువల్ల ఈ రాశివారికి విపరీత రాజయోగంతో పాటు మహా భాగ్య యోగం కలిగే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం చేపట్ట డానికైనా ఈ మూడు రోజుల కాలం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి తప్పకుండా కలిగే అవకాశం ఉంది.

కుంభం: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల్లో ఈ రెండు మహా యోగాలు ఏర్పడినందువల్ల ముఖ్యమైన వ్యక్తి గత, ఆస్తి, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి ఊరట లభిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితంలో సమ స్యలు, వివాదాలు పరిష్కారమై సుఖ సంతోషాలు నెలకొంటాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. విదేశీ సంబంధమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.





























