Weekly Horoscope: వారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 14, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఆదాయపరంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఆశించిన మేరకు ఉపశమనం లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి వారికి జీతభత్యాల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అధికారుల ఒత్తిడి బాగా తక్కువగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 08, 2024 | 5:01 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ప్రస్తుతం గురు, శుక్ర, శనులతో పాటు రాశ్యధిపతి కుజుడు కూడా చతుర్థ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయపరంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఆశించిన మేరకు ఉపశమనం లభిస్తుంది. సుందరకాండ పారాయణం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి ప్రయత్నం తప్పకుండా సత్ఫలితాలనిస్తుంది. పట్టిందల్లా బంగారమవుతుంది.  ఉద్యో గంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి జీవితంలో మీ పనితీరుకు ఆశించిన గుర్తింపు లభి స్తుంది.  వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెరుగు తుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు సర్దుమణుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు భాగ్యంలో, రవి, బుధ గ్రహాలు సప్తమంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఇంటా బయటా సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. నిరుద్యోగులకు కోరు కున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శని, రాహు గ్రహాలు కొద్దిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అధికారుల ఒత్తిడి బాగా తక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. శుభ గ్రహాల అనుకూలత తక్కువగా ఉన్నందువల్ల ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉండకపో వచ్చు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. వ్యక్తిగత, కుటుంబ సమస్యల ఒత్తిడి ఉంటుంది. తరచూ శివార్చన చేయించడం వల్ల కార్యసిద్ధి, వ్యవహార జయం కలుగుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): లాభ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. తరచూ వినాయ కుడికి అర్చన చేయించడం చాలా మంచిది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.  ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): గురు, బుధ, రవి గ్రహాలు ప్రస్తుతం బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో మీ సమర్థతకు, ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల అనుకూలతలు బాగా పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం  పెరుగుతాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): శుక్ర, శనుల అనుకూలత వల్ల ఆదాయ వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా రెట్టింపు ఫలితాలనిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆస్తి వివాదం అనుకూ లంగా పరిష్కారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం వల్ల జీవితంలో ఆశించిన శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలోనూ, రవి, బుధులు ధన స్థానంలోనూ సంచారం చేస్తు న్నందు వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయం దిన దినా భివృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. గురు బలం లేనందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం పెట్టుకోవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రాశివారు కొంత కాలం పాటు ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి రాబడి బాగా వృద్ధి చెందుతుంది వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రవి, బుధ, కుజ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. మీ సమర్థతకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు కలు గుతాయి.  సుబ్రహ్మణ్యాష్టకం చదువు కోవడం వల్ల ముఖ్యమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): శుక్ర, శనుల అనుకూలత కారణంగా ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా నెరవేరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి. అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడతారు. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగి స్తుంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్దాసక్తులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. తరచూ ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): గురు, శని, రవి, బుధ, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. వ్యాపారాలు లాబాల బాటపడతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఈ రాశివారు తరచూ శివార్చన చేయించడం వల్ల ఏలిన్నాటి శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. చదువుల విషయంలో పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు బంధుమిత్రుల వల్ల ఇబ్బందుల్లో పడతారు. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపో తాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): గురు, రవి, బుధుల అనుకూలత వల్ల ఉద్యోగ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. బాధ్యతలు మారడంతో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాల్లో కూడా సఫలమయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా నిలకడగా సాగిపోతాయి. ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈ రాశివారు కూడా తరచూ శివాలయానికి వెళ్లి అర్చన చేయించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఏ పనైనా వ్యయ ప్రయాసలతో పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు అనుకూలంగా ఉండడంతో పాటు లాభస్థానంలో శుక్రుడు, భాగ్య స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల వారమంతా విజయవంతంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. నిరుద్యోగు లకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కార మవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఈ రాశివారు విష్ణు సహస్రనామం పఠించడం చాలా మంచిది.

12 / 12
Follow us