Horoscope Today: మెరుగ్గా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Today Horoscope (December 11, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడే అవకాశముంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఒకటిరెండు శుభవార్తలు అందే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (డిసెంబర్ 11, 2024): మేష రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఒకటిరెండు శుభవార్తలు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు చేపట్టడానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగపరంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. గృహ, వాహన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవ హారాల్లో జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందు తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అధికారులు బాగా ప్రోత్సహిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆదాయం బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కొందరు మిత్రుల ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఒకటిరెండు శుభవార్తలు అందుతాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో వివాదాలను తెలివిగా పరిష్క రించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో కొత్త ప్రోత్సాహకాలను అందుకుంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాలలో ఉన్న కొన్ని ప్రధానమైన అడ్డంకులను తొలగించు కుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి కొత్త అవకాశాలు అందివస్తాయి. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలలో కొద్దిపాటి పురోగతికి అవకాశం ఉంది. బాధ్యతల నిర్వహణ మీద మరింతగా శ్రద్ధ పెంచుతారు. వ్యాపారాలలో చురుకుదనం పెరుగుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెరుగు తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలను చేపడతారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆదాయ వృద్ధికి అవకాశముంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం బంధుమిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులన్నిటినీ పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. మనసులోని కోరికల్లో ఒకటి రెండు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో వాదోపవాదాలకు దిగవద్దు. ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను, లక్ష్యాలను బాగా పెంచే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొద్దిగా ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉంటుంది. తల పెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారం, రాజకీ యాలు తదితర రంగాల్లో ఉన్నవారికి వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి సంబంధ మైన వివాదాలు సర్దుమణుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు మంచి గుర్తింపుతో పాటు డిమాండ్ పెరుగుతుంది. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అంచనాలను మించి సత్ఫలితాలనిస్తాయి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)
ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీల ద్వారా కూడా బాగా లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో విజయాలు, సాఫల్యాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా పురోగతి చెందుతాయి. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టం కలుగు తుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మకపోవడం మంచిది. ప్రయాణాల వల్ల ఉపయోగం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ప్రతి వ్యవహారమూ ఆశించిన విధంగా సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల పరిస్థితి ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఆదాయానికి లోటుండదు. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. చిన్నా చితకా సమస్యలున్నా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అంది వస్తుంది.ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలలో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా పూర్తి అవుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారంలో ఆచితూచి వ్యవహరిం చడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యులతో వీలైనంత సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది.