Astrology 2025: కొత్త ఏడాది కేతువుతో ఆ రాశుల వారికి కనక వర్షం.. అందులో మీ రాశి ఉందా?
కన్యా రాశిలో ఏడాదిన్నరగా సంచారం చేస్తున్న కేతువు మే 18 నుంచి సింహరాశిలోకి మారడం జరుగుతుంది. ఇదే రాశిలో ఏడాదిన్నర పాటు కొనసాగుతుంది. శని, గురువు, రాహు గ్రహాల మాదిరిగానే కేతువు ఫలితాలు కూడా జీవితం మీద అత్యంత ప్రభావం కలిగిస్తాయి.
Ketu Gochar 2025: ప్రస్తుతం కన్యా రాశిలో ఏడాదిన్నరగా సంచారం చేస్తున్న కేతువు మే 18 నుంచి సింహరాశిలోకి మారడం జరుగుతుంది. ఇదే రాశిలో ఏడాదిన్నర పాటు కొనసాగుతుంది. శని, గురువు, రాహు గ్రహాల మాదిరిగానే కేతువు ఫలితాలు కూడా జీవితం మీద అత్యంత ప్రభావం కలిగిస్తాయి. ఇది వక్ర గ్రహమే కాక, పాప గ్రహం కూడా. కేతువు సింహ రాశిలో ప్రవేశించడం వల్ల మేషం, మిథునం, తుల, ధనుస్సు, మీన రాశులకు అనూహ్యమైన శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఈ రాశుల మీద కేతువు కనక వర్షం కురిపించే అవకాశం ఉంది. కేతు గ్రహాన్ని సంతృప్తిపరచడానికి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం, తరచూ లేత ఎరుపు రంగు దుస్తులు ధరించడం, వైఢూర్యం పొదిగిన ఉంగరం వేలికి పెట్టుకోవడం మంచిది.
- మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో కేతు సంచారం వల్ల ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా, సంతృప్తి కరంగా సాగిపోతాయి. ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజ యవంతం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల అపారమైన లాభాలు కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ప్రభుత్వ ఉద్యోగం కూడా లభించే అవకాశంఉంది.
- మిథునం: ఈ రాశికి తృతీయ స్థానంలో కేతువు సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయ త్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. ఆస్తి, గృహ ఒప్పందాలు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార మవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగి పోతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.
- తుల: ఈ రాశికి లాభ స్థానంలో కేతు సంచారం వల్ల అపారమైన ధన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడి లాభాలను ఆర్జించడం ప్రారంభిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు బాగా వృద్ధి చెందుతాయి.
- ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో కేతు సంచారం వల్ల విదేశీ అవకాశాలు అంది వస్తాయి. విదేశాల్లో బాగా సంపాదించుకునే అవకాశాలు కలుగుతాయి. విదేశాల్లో స్థిరపడడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఎక్కువగా ఇతర దేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు చదువుల్లో రికార్డులు సృష్టిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అస మాన ప్రతిభా విశేషాలను కనబరచడం జరుగుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది.
- మీనం: ఈ రాశికి ఆరవ స్థానంలో కేతు సంచారం వల్ల విపరీత రాజయోగాలు, లక్ష్మీ కటాక్షాలు కలుగు తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభించడం, రాజ పూజ్యాలు పెరగడం జరుగుతుంది. అనేక పర్యాయాలు ధన యోగాలు పట్టే సూచనలున్నాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. జీవనశైలి మారిపోతుంది.