AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mercury Transits: ఈ నెల 16న రాశిని మార్చుకోనున్న బుధుడు.. ఈ ఐదు రాశులవారు పట్టిందల్లా బంగారమే..

నవ గ్రహాల్లో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పరిగణిస్తారు. బుధుడు తాత్కాలిక సంచారం ప్రతి రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు బుధుడు వృశ్చికరాశిలో ప్రత్యక్షంగా తిరగబోతున్నాడు. వృశ్చికరాశిలో బుధుడు ప్రత్యక్షంగా అడుగు పెట్టిన తర్వాత ఐదు రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. వీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

Mercury Transits: ఈ నెల 16న రాశిని మార్చుకోనున్న బుధుడు.. ఈ ఐదు రాశులవారు పట్టిందల్లా బంగారమే..
Mercury Transits In Scorpio
Surya Kala
|

Updated on: Dec 11, 2024 | 3:10 PM

Share

హిందూ మత గ్రంథాలలో బుధ గ్రహాన్ని గ్రహాల రాకుమారుడు అంటారు. బుధుడు ప్రస్తుతం తిరోగమన స్థితిలో వృశ్చికరాశిలో సంచరిస్తున్నాడు. నవంబర్ 26 నుంచి బుధుడు వృశ్చికరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు బుధుడు నేరుగా వృశ్చికరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. డిసెంబర్ 16న బుధుడు ప్రత్యక్షంగా వృశ్చికరాశిలో సంచరించనున్నాడు. డిసెంబర్ 16వ తేదీ రాత్రి మధ్యాహ్నం 1:52 గంటలకు బుధుడు నేరుగా వృశ్చికరాశిలో ఎంట్రీ ఇచ్చి వచ్చే ఏడాది జనవరి 4 వరకు బుధుడు ప్రత్యక్షంగా ఈ రాశిలో సంచరిస్తాడు. అనంతరం ఈ స్థితిలో ధనుస్సు రాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడు.

అయితే ఈ నెల 16న బుధుడు వృశ్చికరాశిలో ప్రత్యక్షంగా సంచరించడం వల్ల మిథున రాశితో సహా ఐదు రాశుల వ్యక్తుల జీవితంలో మంచి రోజులు ప్రారంభంకానున్నాయి. ఈ ఐదు రాశుల వారికి అకస్మాత్తుగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపార రంగంలో అభివృద్ధి చెందనున్నారు. ఈ రాశుల వారికి కెరీర్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు ప్రత్యక్షంగా తిరగడం వల్ల ఏ ఐదు రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం..

మేష రాశి: వృశ్చికరాశిలో బుధుడు ప్రత్యక్షంగా సంచరించడం మేషరాశి వారికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆధ్యాత్మికత విషయాలపై దృష్టి పెడతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మేషరాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశంసిస్తారు. మేష రాశి వారు ఈ కాలంలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఏదైనా టెండర్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. శుభ ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులకు కూడా ఈ సమయం శుభప్రదం. రచన, విద్యారంగంలో గౌరవం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: బుధుడు ప్రత్యక్షంగా కదలడం వల్ల మిథునరాశి వారు కూడా విజయాలను అందుకుంటారు. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం చేయవద్దు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మిథున రాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా శుభ ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం మరింత మధురంగా​ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. అత్తమామలతో సంబంధాలు బలపడతాయి. అయితే ఈ సమయంలో రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

సింహ రాశి: బుధుడు ప్రత్యక్షంగా సంచరించడం సింహరాశి వారికి అన్ని విధాలా మేలు జరుగుతుంది. సింహ రాశికి చెందిన స్టూడెంట్స్ పోటీలలో విజయం సాధిస్తారు. కొత్తగా పెళ్లయిన జంటలకు కూడా సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యులు, సోదరుల నుంచి మద్దతు పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఈ సమయం ప్రేమ వివాహాలకు కూడా అనుకూలంగా ఉంటుంది.

కన్య రాశి: బుధుడు ప్రత్యక్షంగా ఉండటం వల్ల కన్య రాశి వారికి సాధారణ ఫలితాలు లభిస్తాయి. స్నేహితులు, బంధువుల నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త ఒప్పందం చేసుకోవాలనుకుంటే.. ఇది శుభ సమయం. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

కుంభ రాశి: బుధుడు ప్రత్యక్షంగా వృశ్చికరాశిలోకి అడుగు పెట్టిన తర్వాత ఈ రాశికి చెందిన వారు చేపట్టిన అని పనుల్లో విజయాన్ని పొందుతారు. కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే లేదా కొత్త ఒప్పందం చేసుకోవాలనుకుంటే ఈ సమయంలో చేయండి. ఉద్యోగం మారాలనుకుంటే ఇది మంచి సమయం. అయితే శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండటం అవసరం. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికీ ఇది శుభ సమయం. ఈ సమయంలో పిల్లల బాధ్యతల నుంచి ఉపశమం లభిస్తుంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.