Atul Subhash case: బెంగళూరు టెకీ కేసులో కీలక పరిణామం..ఇప్పుడు అతుల్ ఆత్మ శాంతిస్తుందంటున్న నెటిజన్లు!
బెంగళూరు పోలీసులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో అతుల్ భార్య నికితా సింఘానియా సహా ముగ్గురిని అరెస్టు చేశారు. నికితా తల్లి నిషా సింఘానియా, బావమరిదిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
AI సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో బెంగళూరు పోలీసులు అతుల్ భార్య నిందితురాలు నికితా సింఘానియా సహా ముగ్గురిని అరెస్టు చేశారు. నికిత హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉంది. నికితా తల్లి నిషా సింఘానియా, బావమరిదిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో వారిని హాజరుపరిచారు. డిసెంబర్ 14 న బెంగళూరు పోలీసులు గురుగ్రామ్ నుండి నికితను అరెస్టు చేశారు. అదే రోజు, నికితా తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్‌లను కూడా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో అరెస్టు చేశారు.
అనంతరం ముగ్గురిని ప్రయాగ్‌రాజ్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. నికితా మామ సుశీల్ సింఘానియా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. జాన్‌పూర్ సహా పలు ప్రాంతాల్లో సుశీల్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
డిసెంబర్ 9న బెంగళూరులోని తన ఫ్లాట్‌లో అతుల్ సుభాష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతను గంటకు పైగా ఓ వీడియో చేశాడు. తన చావుకు ఐదుగురు వ్యక్తులు బాధ్యులు అని, తన భార్య నికితా సింఘానియా, అత్తగారు నిషా, బావ అనురాగ్, మామ సుశీల్, జడ్జి రీటా కౌశిక్‌లు తన చావుకు కారణమని చెప్పాడు. గత కొన్నేళ్లుగా వారు తనని హింసిస్తున్నారని వీడియోలో అతుల్ పేర్కొన్నాడు. అంతే కాదు అతుల్ 24 పేజీల సూసైడ్ నోట్‌కు రాశాడు. తను రూ.80వేలు సంపాదిస్తున్నాని, తన భార్య తనకు దూరంగా వెళ్లిపోయిందిని, కొడుకుని కూడా తీసుకెళ్లిందని. తనపై 9 ఫేక్ కేసులు పెట్టిందని సూసైడ్ నోట్‌లో ఆరోపించాడు. కోర్టు తీర్పుతో చిన్నారి కోసం రూ.40 వేలు కూడా పంపినట్లు. కానీ వారు నెలకు రూ.80 వేలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తన స్వంత జీతం అని, తన భార్య బాగా సంపాదిస్తున్నా తనను వేధిస్తుందని పేర్కొన్నాడు. ఫ్యామిలీ కోర్టు జడ్జి రీటా కౌశిక్ తన భార్య మాట మాత్రమే విన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి