స్టన్నింగ్ లుక్స్ మైండ్ బ్లాక్ చేస్తున్న అక్కినేని వారి కోడలు
19 December 2025
Pic credit - Instagram
Phani Ch
శోభిత ధూళిపాళ్ళ మే 31, 1992లో ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో జన్మించింది. తెలుగు బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చింది
ఈ తెలుగు అందం మొదట హిందీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'రామన్ రాఘవ్ 2.0'లో నటించింది.
2013లో ఫెమినా మిస్ ఇండియాలో రన్నరప్ (మిస్ ఇండియా ఎర్త్) అయింది. మిస్ ఎర్త్ 2013లో భారత్‌ను ప్రతినిధిగా వెళ్లింది. కింగ్‌ఫిషర్ క్యాలెండర్ 2014లో ఫీచర్ అయింది.
ఆ తర్వాత 'చెఫ్', 'కాలాకాండి' మొదలగు హిందీ సినిమాలు చేసింది. తెలుగులో అడవి శేష్ హీరోగా వచ్చిన 'గూఢచారి' లో నటించి ఇక్కడి వారికి పరిచయమైంది.
తెలుగులో రెండు మూడు సినిమాల్లో మెరిసింది శోభిత.తమిళంలో ఆమె చేసిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో..ఆమె అందానికి ఫిదా అయ్యారు ఆడియన్స్.
ఇక సౌత్ లో తెలుగు, తమిళ భాషల నుంచి వరుస ఆఫర్లు ఆమె గుమ్మం తొక్కుతున్నాయి. ఈక్రమంలో బాలీవుడ్ నుంచి కూడా శోభితకు అవకాశాలు తక్కువేమి లేవు.
2024 ఆగస్టు 8న నాగ చైతన్యతో నిశ్చితార్థం. డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంప్రదాయ తెలుగు పెళ్లి జరిగింది.