NT Awards: టీవీ9 కు అవార్డుల పంట.. న్యూస్ టెలివిజన్ అవార్డ్స్‌లో 71 అవార్డ్స్ కైవసం.. వెబ్‌సైట్‌కు కూడా!
ప్రజలే టీవీ9 బలం, బలగం. నిజమే టీవీ9 ఇజం.. ప్రజల పక్షాన ఉండడమే టీవీ9 నైజం. వేగం ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా టీవీ9 ప్రభంజనం. ది లీడర్‌గా టీవీ9కి మరోసారి పట్టం కట్టింది న్యూస్ టెలివిజన్.
ప్రేక్షకులకు అత్యంత వేగంగా, కచ్చితమైన సమాచారం అందించాలని..టీవీ9 తపిస్తుంది. అందుకోసం ప్రతిరోజూ కృషి చేస్తుంది. ప్రతి వార్తనూ అద్భుతంగా మీకు ప్రెజెంట్ చేయాలని ఆరాటపడుతుంది. ఆ ప్రయత్నంలో లభించే అవార్డులు.. జాతీయ స్థాయిలో వరించే పురస్కారాలు.. టీవీ9కు మరింత ఉత్సాహాన్నిస్తాయి. తాజాగా టీవీ9ను ప్రతిష్టాత్మక NEWS TELEVISION అవార్డులు వరించాయి. ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో..టీవీ9 నెట్‌వర్క్ 71 NT అవార్డులను కైవసం చేసుకుంది. వాటిలో అత్యధికంగా 21 అవార్డులను సొంతం చేసుకుని.. జాతీయ వేదికపై జయకేతనం ఎగురవేసింది టీవీ9 తెలుగు!
టీవీ9 నెంబర్ వన్ న్యూస్ ఛానెల్.. మెరుగైన సమాజమే లక్ష్యంగా అలుపెరుగని ప్రయాణం.. రెండు దశాబ్దాల ప్రస్థానంలో ప్రజల కోసం.. ప్రజల పక్షాన గళమెత్తిన మేటి ఛానెల్.. తెలుగువారి ఠీవీ..టీవీ9. పుట్టింది తెలుగు గడ్డపై.. ఏలుతోంది దేశాన్ని.. ప్రేక్షాదరణలో టీవీ9 కి తిరుగులేదు. అవార్డులతో టీవీ9కి సాటి లేదు. ప్రతిష్టాత్మకమైన న్యూస్ టెలివిజన్ వేదికపై టీవీ9 నెట్‌వర్క్‌కు అవార్డుల జాతర. NT అవార్డుల్లో 71 అవార్డులను టీవీ9 నెట్ వర్క్ సొంతం చేసుకుంది. దటీజ్ టీవీ9.
మరోసారి ఎన్టీ అవార్డుల్లో దుమ్మరేపిన టీవీ9 తెలుగు. 21వ వసంతాల టీవీ9 తెలుగుకు.. ఈ ఏడాది 21 ఎన్టీ అవార్డులు వరించాయి. లోకల్ అనుకుంటివా గ్లోబల్ అనేలా టీవీ9కు ఈ సమున్నత సత్కారం, సగౌరవం దక్కడం టీవీ9 క్రెడిబుల్టీకి వీక్షకులు ఇచ్చిన ఆశీర్వాదం. డైలీ న్యూస్ షో, టాక్ షో, డిబేట్, ఎలక్షన్ ప్రొగ్రామ్స్, ప్రోమోస్,గ్రాఫిక్స్, ఎలక్షన్ ప్రజెంటేషన్, బెస్ట్ మార్కెటింగ్ ఇన్సిషియేటివ్, టెక్నాలజీ ఇన్నోవేషన్, డిజిటల్, వెబ్‌సైట్… ఇలా అన్ని ప్లాట్‌ఫార్మ్‌లో టీవీ9దే జయకేతనం.
వార్తా ప్రసారాల్లో వేగం.. విశ్లేషణలో కచ్చితత్వం.. టీవీ9 బిగ్ న్యూస్–బిగ్ డిబేట్..ఓ ట్రెండ్ సెట్టర్. గడియారంలో గంట ఏడు కొట్టిందంటే.. తెలుగు ఇళ్లలో టీవీ9 బిగ్ న్యూస్ -బిగ్ డిబెట్ సౌండ్ మోగాల్సిందే. 21 ఏళ్ల టీవీ9 ప్రస్థానంలో తెలుగు ప్రజల నమ్మకం బిగ్ న్యూస్-బిగ్ డిబేట్. వార్తలు-విశ్లేషణలతో పాటు డైనమిక్ ప్రజెంటేషన్ లో బిగ్ న్యూస్-బిగ్ డిబెట్ ఓ సన్సెషన్. ది బెస్ట్ ప్రైమ్ టైమ్ షోగా బిగ్ న్యూస్-బిగ్ డిబెట్‌కు మరోసారి సగౌరవ సత్కారం. ఈసారి డబుల్ ధమకా. రెండు ఎన్టీ అవార్డులను కైవసం చేసుకుంది. ఎలక్షన్ ప్రొగ్రామ్‌లో టీవీ9 కొత్త ఒరవడి…5 ఎడిటర్స్. సమకాలీన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణతో తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రయోగం. బెస్ట్ న్యూస్ డిబెట్ షో విభాగంలో 5 ఎడిటర్స్ షోకు ప్రతిష్టాత్మక ఎన్టీ అవార్డ్ వరించింది.
తెలుగు మీడియాలో టీవీ9 మరో సంచలనం సీఎం ఫ్యాక్టర్.. డాక్యూ సిరీస్. ఎవరూ సాహసించని ప్రయోగం ఇది. రోటీన్ ప్యాకేజింగ్ తరహా కాకుండా వీక్షకులకు కొత్త అనుభూతినిచ్చేలా.. సరికొత్తగా డిజైన్ చేయబడిన ప్రయోగం..సీఎం ఫ్యాక్టర్. డాక్యూ సిరీస్ వినూత్న ఆలోచనకు వీక్షకుల నుంచి విశేష స్పందనతో పాటు ఇప్పుడు సీఎం ఫ్యాక్టరీకి న్యూస్ డాక్యుమెంటరీ విభాగంలో ఎన్టీ అవార్డు. అలా ఎప్పటికప్పుడు మార్పును ఆహ్వానిస్తూ..టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ.. FOR BETTER SOCIETY అన్న సంకల్పానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తూ ముందుకు సాగుతోంది టీవీ9.
నిఖార్సయిన వార్తలు..నిష్ఫక్షపాత జర్నలిజం.. సమాచారంలో స్ఫష్టత.. ప్రసారంలో వేగం…లోతైన విశ్లేషణతో తెలుగు ప్రజల్లో గుండెల్లో ఠీవీగా నిలిచిన నాలుగోస్తంభం.. టీవీ9 బిగ్ న్యూస్ -బిగ్ డిబెట్. బిగ్ న్యూస్- బిగ్ డిబెట్‌కు మరోసారి NEWS TELEVISION AWARDS పట్టం. బెస్ట్ ప్రోగ్రామ్‌కు కేటగిరిలో బిగ్ న్యూస్-బిగ్ డిబేట్‌కు బిగ్ అప్లాజ్. ప్రైమ్ టైమ్ యాంకర్‌గా టీవీ9 మేనిజింగ్ ఎడిటర్ రజనీకాంత్‌పై 2 దశాబ్దాల నమ్మకం. బిగ్ న్యూస్-బిగ్ డిబెట్ తెలుగు ప్రజల ధైర్యం, ఆ గళం ఓ చైతన్యం. ప్రజల పక్షాన సూటిగా ప్రశ్నించే సాహసం. జర్నలిజంలో.. ఎలక్ట్రానిక్ మీడియాలో విప్లవం..వి.రజనీకాంత్. టీవీ9 ప్రస్థానంలో తెలుగు ప్రజల మదిలో విశిష్ట స్థానం సంపాదించుకున్న వెర్సటైల్ ప్రొగ్రామ్. బిగ్ న్యూస్– బిగ్ డిబెట్. ఎప్పట్లానే ఈఏడాది కూడా బిగ్ న్యూస్ బిగ్ డిబెట్‌కు అవార్డుల పంటే. బెస్ట్ ప్రైమ్ టైమ్ న్యూస్ షో ప్రొడ్యూసర్‌గా టీవీ9 తెలుగు పొలిటికల్ ఔట్ పుట్ ఎడిటర్ రమేష్ యెల్లంకి ఎన్టీ అవార్డులను అందుకున్నారు.
క్రాస్ ఫైర్.. ఎలక్షన్ సీజన్‌లో వినూత్నం.. నవీనం. ప్రముఖ లీడర్లపై పదునైన ప్రశ్నలు సంధిస్తూ సాగే టాక్ షో. క్రాస్ ఫైర్‌కు ప్రజల్లో రాజకీయ విశ్లేషణలపై ఆసక్తిని పెంచింది. తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన అపూర్వ ఆదరణతో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ షో బ్రాండ్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల దశ,దిశను నిర్దేశించే కీలక సమయంలో నాయకులకు సూటి ప్రశ్నల సంధిస్తూ సరికొత్త రాజకీయ ఎజెండా సెట్ చేసిన క్రాస్ ఫైర్ ఓ న్యూస్ టెలివిజన్ రంగంలో ఓ విప్లవం. అందుకే క్రాస్ ఫైర్ ..బెస్ట్ టాక్ షో విభాగంలో ప్రతిష్టాత్మక ఎన్టీ అవార్డును కైవసం చేసుకుంది.
ఎలక్షన్ సీజన్‌లో టీవీ9 తెలుగు మరో సంచలనం… ఫైవ్ ఎడిటర్స్. ఐదుగురు సంపాదకులు నేరుగా లీడర్లను ప్రశ్నించడం సహా వారి విజన్ ఏంటో ప్రజలకు కళ్లకు కట్టిన న్యూస్ డిబెట్ షో.. ఫైవ్ ఎడిటర్స్. పాత చింతకాయల శైలికి భిన్నంగా.. పొలిటికల్ గ్రామర్‌కు కొత్త లుక్ ఇవ్వడంలో గ్లామర్ మార్చేసిన ప్రొగ్నామ్ 5 ఎడిటర్స్. ఎలక్షన్ సీజన్‌లో ట్రెండింగ్ నిలిచిన 5 ఎడిటర్స్ ప్రొగ్రామ్ ది బెస్ట్ న్యూస్ డిబెట్ షో విభాగంలో ఎన్టీ అవార్డును కైవసం చేసుకుంది.టీవీ9 తెలుగు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళికృష్ణ ఎన్టీ అవార్డును అందుకున్నారు.
ఎన్టీ అవార్డ్ గెలుచుకున్న ప్రతి ప్రోగ్రామ్…ఓ వినూత్నశైలిలో సరికొత్త ప్రజెంటేషన్‌తో సాగినవే. వీక్షకులను కట్టిపడేసినవే. సోషల్ మెస్సేజ్ ఇస్తూనే…ప్రేక్షకులను సరికొత్త అనుభూతి ఇచ్చినవే. అందులో వీక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ప్రోగ్రామ్ డాక్యూసిరీస్. అందులో తొలి భాగంగా వచ్చిందే ది సీఎం ఫ్యాక్టర్. ఎలక్షన్ సీజన్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది ది సీఎంఫ్యాక్టర్. ఇది రెగ్యులర్ ప్యాకేజింగ్ స్టైల్ కాదు. ఇంతవరకూ ఏ మీడియా ఏజెన్సీ టచ్ చేయని సరికొత్త ప్రజెంటేషన్. ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో.. ఐదేళ్లలో ఏం సాధించిందో…సామాన్యుడికి అర్ధమయ్యే రీతిలో రూపొందించిన టెరిఫిక్ అండ్ డైనమిక్ ప్రోగ్రామ్ ది సీఎం ఫ్యాక్టర్. ఈతరహా స్టైలింగ్..తెలుగు మీడియాలోనే కాదు..జాతీయ మీడియాలోనే రాలేదు. అందుకే ఎన్టీ అవార్డ్ దక్కింది. దీనికి కర్త కర్మ క్రియ.. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్. అయితే ఆయన ఆలోచనను తెరపైకి తీసుకురావడంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భానుకిరణ్, అసోసియేట్ ఎడిటర్ మాల్యాద్రితో పాటు వీడియో ఎడిటర్ మల్లిఖార్జున్ సఫలమయ్యారు.తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించారు. ఐదు రోజులు గంటపాటు ప్రసారం చేసిన ఈప్రోగ్రామ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఎలక్షన్ సీజన్లలో బుల్లెట్‌లా దూసుకుపోయిన ప్రోగ్రామ్ టీవీ9 బుల్లెట్ రిపోర్టర్. ఆరంభమే అద్భుతాలు చేసింది. వినూత్నంగా తెలుగు రాష్ట్ర్లాల ప్రజల నాడిని గ్రౌండ్‌లెవల్లో తెలుసుకునే ప్రయత్నం చేసిన ప్రోగ్రామ్ బుల్లెట్ రిపోర్టర్. రాజకీయ సరళిని.. అభివృద్ధి తీరును బుల్లెట్ మీద విశ్లేషించారు. టీవీ9 సీనియర్ జర్నలిస్ట్ ప్రత్యూష! వణికించే చలిని.. మండే ఎండలను లెక్కచేయకుండా రెండు రాష్ట్రాల్లోనూ బుల్లెట్ మీద ప్రయాణిస్తూ.. సామాన్యుడి గొంతు వినిపించారు ప్రత్యూష. ఇదే ప్రోగ్రామ్‌కు ప్రోమో ఫర్ ఏ షో తెలుగు విభాగంలో అవార్డ్ దక్కించుకున్నారు అనిల్ మద్దూరి. ఇక డైలీ న్యూస్ ప్రజెంటర్ విభాగంలో యాంకర్ ప్రత్యూషకు మరో అవార్డు దక్కింది. ఇలా తెలుగు టెలివిజన్ చరిత్రలో అప్రహితంగా అవార్డుల జాతర కొనసాగిస్తూ వస్తోంది టీవీ9.
ఇక ఎలక్షన్ సీజన్‌లో టీవీ9 మార్కు ప్రోగ్రామ్!.. షాడో 9. లీడర్‌ను నీడలా ఫాలో అయ్యి..ప్రజలకు ఏం చేశారో ప్రశ్నించిన ప్రోగ్రామ్..! అభివృద్ధిని నిలదీసిన ప్రోగ్రామ్!! ఈవిభాగంలో టీవీ9 సీనియర్ ప్రజెంటర్ నేత్రకు అవార్డు దక్కింది. ఇక రేటింగ్‌లోనూ, ప్రేక్షకాదరణలోనూ రాకెట్‌లా దూసుకుపోయి.. వీక్షకులను విపరీతంగా కట్టిపడేసిన ప్రోగ్రామ్ ఇస్మార్ట్ న్యూస్. ప్రతిరోజు ఉదయాన్నే ఛలోక్తులు..చురుక్కులు..చమక్కులతో అరగంట సేపు కడుపుబ్బా నవ్వించడమే కాదు.. ఆలోచింపజేసే కథనాలతో కితకితలు పెట్టిస్తుంది. ఇస్మార్టు న్యూస్ కు 2 ఎన్టీ అవార్డులు వరించాయి. చీరకట్టుతో..తమ మాట విరుపుతో , పక్కా తెలంగాణ యాసలో వార్తలను అందిస్తూ…ఆరేళ్లుగా నిర్విరామంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్‌లో ప్రొడ్యూసర్ కుమార్ కౌటమ్ అతని టీమ్ శ్రమ ఉంది. ఇక ఇస్మార్టు న్యూస్ యాంకర్ విషిత ఉత్తమ ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా అవార్డు సాధించారు. తిరుగులేని ప్రజాదరణతో దూసుకుపోతున్న ఇస్మార్టు న్యూస్ కు ఉత్తమ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం విభాగంలోనూ అవార్డు గెలుచుకుంది.
టీవీ9 ఆ ఠీవీ వేరు..లుక్ మరో లెవల్. ఇక ఎన్నికల సీజన్‌లో టీవీ9 గ్రాఫిక్ టీమ్ ప్రజెంటేషన్ సూపర్ సే ఊపర్. వీక్షకుల మాటే ఎన్టీ అవార్డుల బాటగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక.. ఎన్నికలు , కౌంటింగ్ డే ప్రజెంటేషన్‌లో టీవీ9 గ్రాఫిక్స్ అదుర్స్ అన్పించాయి. ఫలితాలు ఎటు వైపు.. క్షణక్షణానికి నెంబర్ల ఎలా మారుతున్నాయో సామాన్యులకు అర్ధమయ్యేలా టీవీ9 గ్రాఫిక్స్ ప్రతీ అప్‌డేట్‌ను కళ్లకు కట్టాయి. ప్రజెంటేషన్ పొటెన్షియల్‌లో జాతీయ చానెళ్లకు తీసిపోని విధంగా టీవీ9 గ్రాఫిక్ టీమ్ ఎఫెర్ట్స్‌ను చూపారు. ప్రజాదరణలో వారి కృషి రిఫ్లెక్టయింది. అందుకు నిదర్శనమే నేషనల్ టెలివిజన్ వేదికపై టీవీ9 గ్రాఫిక్స్ కు టీవీ9 అవార్డుల పంట. ఛానల్ ప్యాకేజింగ్ , స్పెషల్ ఏఆర్స్..గ్రాఫిక్స్ విభాగంలో మనోజ్ అండ్ టీమ్‌కు అవార్డు కైవసం చేసుకుంది. ప్రొమో క్యాంపెయిన్ విభాగంలో అనిల్, అవినాష్, ప్రొమో ఫర్ ఏ ఛానెల్ విభాగంలో సయ్యద్ లియాఖత్ అలీ, బి. రమేష్‌లకు ఎన్టీ అవార్డ్ దక్కింది. ఇక తెలంగాణ, ఏపీ , కర్నాటక ఎన్నికల్లో అద్భూతమైన గ్రాఫిక్స్ ఇచ్చిన మనోజ్ అండ్ టీమ్.. బెస్ట్ యూస్ ఆఫ్ గ్రాఫిక్స్ బై ఏ న్యూస్ ఛానెల్ విభాగం సహా టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఇన్ న్యూస్ టెలివిజన్ విభాగంలోనూ ఎన్టీ అవార్డులను కైవసం చేసుకున్నారు.
ఇక మెరుగైన సమాజమే లక్ష్యంగా సోషల్ రెస్పాన్స్ బుల్టీపై ప్రజాచైతన్యం కోసం టీవీ9 ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలను చేపడుతూనే ఉంది. ప్రకృతి, పర్యావరణ రక్షణ సహా సామాజిక బాధ్యతగా సమాజ హితం కోసం ప్రతీ అంశంపై చైతన్యం కల్పిస్తోంది. సీడ్ బాల్ క్యాంపెయిన్‌తో ఎందర్నో కదిలించింది. ఆ స్ఫూర్తికి, కృషికి టీవీ9 కు ఎన్టీ అవార్డు వరించింది. బెస్ట్ మార్కెటింగ్ ఇన్షియేటివ్ ఫ్రమ్ ఏ న్యూస్ ఛానెల్ విభాగంలో ప్రతిష్టాత్మక ఎన్టీ అవార్డ్‌ను సొంతం చేసుకన్నారు నోబెల్, చారి, అశోక్‌కుమార్. అలాగే బెస్ట్ బ్రాండ్ పార్టనర్‌షిప్ ఆన్ న్యూస్ టెలివిజన్ కేటగిరిలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మీడియా పార్టనర్‌గా టీవీ9కు ఎన్టీ అవార్డు దక్కింది. అశోక్‌కుమార్ అవార్డును అందుకున్నారు.
ఇక డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లోనూ టీవీ9 తెలుగుకు అవార్డుల పంటపండింది. న్యూస్ ఛానెల్ వెబ్‌సైట్ కేటగిరిలో టీవీ9 తెలుగు ఎన్టీ అవార్డును కైవసం చేసుకుంది. అలాగే మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా టీవీ న్యూస్ బ్రాండ్‌లోనూ టీవీ9 తెలుగు ఎన్టీ అవార్డును సొంతం చేసుకుంది. స్ట్రాంగెస్ట్ డిజిటల్ ఫుట్‌ఫ్రింట్ ఆఫ్ ఏ న్యూస్ నెట్‌వర్క్‌లోనూ టీవీ9 తెలుగు ఎన్టీ అవార్డును కైవసం చేసుకుంది. టీవీ9 స్టయిల్, టీవీ9 డైనమిజం.. క్లాస్ కు క్లాస్. tv9 డిజిటల్ ఫుట్ప్రింట్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్, మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా న్యూస్ బ్రాండ్, న్యూస్ చానల్ వెబ్‌సైట్, బెస్ట్ బ్రాండ్ పార్ట్‌నర్‌షిప్, బెస్ట్ మార్కెటింగ్ ఇనిషియేటివ్.. ఇదే ఫామ్ మున్ముందు కూడా.. అవార్డుల్లో రప్పారప్పా.. దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్.. అందరికంటే ఎక్కువ అవార్డులు.. దటీజ్ టీవీ9 నెట్‌వర్క్..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..