Malaria Cases: భారత్‌లో తగ్గిన మలేరియా మరణాలు.. డబ్లూహెచ్‌వో సంచలన రిపోర్టు విడుదల

ఇండియాలో మలేరియా కేసులు తగ్గుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదకలో సంచలన విషయాలను బయటపెట్టింది.

Malaria Cases: భారత్‌లో తగ్గిన మలేరియా మరణాలు.. డబ్లూహెచ్‌వో సంచలన రిపోర్టు విడుదల
Malaria Cases
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 15, 2024 | 11:00 AM

భారత్ దేశంలో మలేరియా కేసులు తగ్గుతున్నాయి. మలేరియా కేసులు, మరణాలు రెండింటిలోనూ 69 శాతం తగ్గించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది.” భారత్‌లోని అధిక రాష్ట్రాల్లో మలేరియా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి” పేర్కొంది. మలేరియా కేసులను తగ్గించడంలో, మరణాల రేటును తగ్గించడంలో భారతదేశం విజయవంతమైంది.

భారతదేశంలో మలేరియా కేసులు 2017 సంవత్సరంలో 6.4 మిలియన్లుగా ఉన్నాయని, 2023లో 2 మిలియన్లకు తగ్గాయి. మలేరియా కేసుల్లో దాదాపు 70 శాతం తగ్గినట్లు, మలేరియా మరణాలు కూడా 69 శాతం తగ్గినట్లు WHO తెలిపింది. మలేరియాకు సంబంధించి ఈ నివేదిక ప్రతి సంవత్సరం విడుదలవుతుంది. అనేక దేశాల డేటా ఇందులో చేర్చబడుతుంది. భారతదేశంలో మలేరియా సంభవించే రేటు ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉంది. గ్లోబల్ మలేరియా ప్రోగ్రామ్ డైరెక్టర్ డా.డానియల్ మాదండి మాట్లాడుతూ.. మలేరియా కేసులను తగ్గించడంలో భారతదేశం అద్భుతమైన కృషి చేసిందన్నారు. భారత్‌తో పాటు రువాండా, లైబీరియా వంటి దేశాల్లో కూడా భారీ తగ్గుదల కనిపించదన్నారు.

ICMRలోని ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వ్యాలీకి చెందిన వ్యాధి నిర్మూలన విభాగం అధిపతి డాక్టర్ రజనీ కాంత్ శ్రీవాస్తవ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. ఆర్టెమిసినిన్ (ACT), దీర్ఘకాలం పనిచేసే క్రిమిసంహారక ఔషధాల కలయిక వల్ల భారతదేశంలో ఈ వ్యాధిని నియంత్రించడం సాధ్యమైందని చెప్పారు.

దోమల వల్ల మలేరియా వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఆడ అనాఫిలిస్ ద్వారా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన దోమ ఒక వ్యక్తిని కుట్టినప్పుడు, అతనికి మలేరియా వస్తుంది. మలేరియా కాటు వల్ల శరీరంలో నొప్పి, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రంగా కూడా మారుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో మలేరియా కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై ప్రపంచ మలేరియా నివేదికను WHO వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి