Vikrant Massey : ఆ సినిమా చూసి ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టారు.. బాలీవుడ్ హీరో..
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు విక్రాంత్ మాస్సే. సీరియల్ హీరోగా బుల్లితెరపై సినీప్రయాణం మొదలు పెట్టిన ఈ నటుడు.. ఇప్పుడు వెండితెరపై విభిన్న కంటెంట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

పాన్ ఇండియా సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని హీరో విక్రాంత్ మాస్సే. 12th ఫెయిల్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. ఈ చిత్రంలో విక్రాంత్ నటనపై ప్రేక్షకులు, సినీ విమర్శకుల సైతం ప్రశంసలు కురింపించారు. హీరోయిజం, యాక్షన్ చిత్రాలు కాకుండా విభిన్నమైన కంటెంట్ సినిమాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్నారు విక్రాంత్ మాస్సే. ఇటీవలే ది సబర్మతి రిపోర్ట్ సినిమా ద్వారా అడియన్స్ ముందుకు వచ్చాడు. నవంబర్ 15న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలలో నటించారు. రిధి డోగ్రా కీలకపాత్ర పోషించారు. 2002లో గుజరాత్ గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు డైరెక్టర్ ధీరజ్ సర్నా.
ఈ సినిమాను పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ చిత్రయూనిట్ తో కలిసి వీక్షించారు. ప్రధాని, ఇతర క్యాబినెట్ సభ్యులతో కలిసి సినిమాను చూసే అవకాశాన్ని పొందిన ఏకైక హీరో విక్రాంత్ మాస్సే కావడం విశేషం. ఇక ఇదే విషయంపై ఇటీవల జరిగిన టైమ్స్ నెట్ వర్క్ ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్ లో విక్రాంత్ మాస్సే స్పందించారు. “ప్రధానమంత్రి నరేంద్రమోదీ, క్యాబినెట్ మంత్రులతో ఎన్నో విషయాల గురించి చర్చించాము. ఆ వివరాలను గోప్యంగా ఉంచడం ఉత్తమమని నేను నమ్ముతున్నాను. అయినా సబర్మతి రిపోర్ట్ సినిమాను ప్రధానమంత్రి నరేంద్రమోదీగారు పూర్తిగా ఆస్వాదించారు. మేము ఆ సినిమా కోసం చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. నా నటనపై ప్రశంసలు కురిపించారు. నా జీవితంలో మోదీగారి పొగడ్త ఎప్పటికీ మర్చిపోలేను. సినిమా చూస్తూ మోదీగారు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కళ్లలోకి నీళ్లు రావడం చూశాము. నేను నా పిల్లలకు, మనవళ్లతో ఈ అనుభవాన్ని పంచుకుంటాను. నా సినిమా చూసి ప్రధాని నన్ను మెచ్చుకున్నాడని చెబుతాను” అంటూ విక్రాంత్ మాస్సే చెప్పుకొచ్చారు.
న్యూఢిల్లీలోని పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో సబర్మతి రిపోర్ట్ సినిమాను ప్రదర్శించారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర ఎంపీలు కూడా హాజరయ్యారు. అనంతరం ఈసినిమా గురించి మోదీ సత్యాన్ని చూపించినందుకు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని గతంలో ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘నిజం చెప్పారు. సత్యం బయటకు రావడం మంచిది. కల్పిత కథనాలు పరిమిత కాలం మాత్రమే కొనసాగుతాయి. కానీ సామాన్యులకు కూడా అర్థమయ్యేరీతిలో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడం సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




