దారుణం.. పొరపాటున వేరే గదికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ హోటల్‌లో 30 ఏళ్ల మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. స్నేహితురాలి గదికి వెళ్తూ పొరపాటున మరో గదిలోకి వెళ్లగా, ముగ్గురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మూడు గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది.

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఛత్రపతి శంభాజీ నగర్ రైల్వేస్టేషన్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో 30 ఏళ్ల మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లిన ఆమె.. పొరపాటున వేరే గదిలోకి వెళ్లింది. అక్కడ మందు పార్టీ చేసుకుంటున్న ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి, రాత్రంతా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తెల్లవారుజామున తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మూడు గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న బాధితురాలు స్నేహితురాలిని కలిసేందుకు హోటల్‌కు వెళ్లింది. ఆమె స్నేహితురాలు గది నంబర్ 105లో ఉంది. ఆమె స్నేహితురాలి గది నుండి తిరిగి వస్తుండగా, ఆమె అనుకోకుండా రెండవ అంతస్తుకు వెళ్లి గది నంబర్ 205 తలుపు తట్టింది. లోపల ముగ్గురు యువకులు మద్యం సేవిస్తున్నారు. ఆమెను చూడగానే, వెంటనే వారు ఆమెను బలవంతంగా లోపలికి లాకెళ్లారు.
నిందితులు మహిళను బలవంతంగా బీరు తాగించి, రాత్రంతా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు.. తెల్లవారుజామున ఆ మహిళ వారి బారి నుండి తప్పించుకుని కేకలు వేస్తూ బయటకు పరిగెత్తింది. వెంటనే వేదంత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి కేవలం మూడు గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఘనశ్యామ్ భౌలాల్ రాథోడ్, రిషికేశ్ తులసీరామ్ చవాన్ మరియు కిరణ్ లక్ష్మణ్ రాథోడ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..








