Watch: అపార్ట్‌మెంట్‌లో దూరిన చిరుతపులి.. చిన్నారి సహా ఏడుగురిపై దాడి.. చివరకు
జనావాసాల్లోకి వస్తున్న వన్య మృగాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. మహారాష్ట్రలో ఈ తరహా ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. లేటెస్ట్‌గా ముంబై నగర శివార్లలోని భయాందర్ ఈస్ట్‌లో చిరుత పులి ఏడుగురిని గాయపరిచింది. స్థానికుల సమాచారంతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. చిరుతపులి హల్‌చల్ చేసిన పారిజాత్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు

ముంబైలోని నివాస ప్రాంతంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. మీరా భయాందర్ ప్రాంతంలో స్థానికులపై చిరుత దాడి చేసింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో చిరుత దాడి స్థానికుల్ని భయబ్రాంతులకు గురి చేసింది. చిరుతపులి దాడిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అటవీ శాఖ బృందం దానిని పట్టుకోవడానికి రంగంలోకి దిగింది. మీరా భయాందర్‌లోని బిపి రోడ్‌లోని పారిజాత్ భవనంలోకి చిరుతపులి ప్రవేశించడంతో భయాందోళనలు వ్యాపించాయి. చిరుతపులి శబ్దం విన్న వెంటనే భవనంలో నివసిస్తున్న ప్రజలు తమ ఇళ్ల తలుపులు, కిటికీలను మూసివేసుకుని ఇంట్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత కొంతమంది స్థానికులు ధైర్యంచేసి చిరుతను ఒక గదిలో బంధించారు.
సమాచారం ప్రకారం, ఉదయం 8 గంటలకు చిరుతపులి భవనంలోకి ప్రవేశించింది. కనిపించిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ దాడిలో చిన్నారి సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
వీడియో ఇక్కడ చూడండి..
స్థానికుల సమాచారంతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. చిరుతపులి హల్‌చల్ చేసిన పారిజాత్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు చేరుకుని గంటల తరబడి శ్రమించిన తరువాత అతికష్టం దాన్ని బంధించారు. దాంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అప్పటికీ గానీ స్థానికుల్లో చిరుత భయం తగ్గింది.
వీడియో ఇక్కడ చూడండి..
A leopard entered the Parijat Building on BP Road in Bhayandar this morning. 4 people were injured in the attack. pic.twitter.com/NV4LwU2Zuj
— Suhas Birhade ↗️ (@Suhas_News) December 19, 2025
मीरारोड – भाईंदर पूर्वेच्या तलाव रोड भागात भर नागरी वसाहतीत बिबट्या आल्याने लोकांमध्ये एकच घबराट माजली आहे. बिबट्या याने तीन जणांना जखमी केल्याचे प्राथमिक वृत्त आहे. बिबट्या हा सध्या पारिजात इमारतीमध्ये असून अग्निशमन दलाने एका जखमी मुलीस सुखरूप बाहेर काढले आहे. आज सकाळची ही घटना… pic.twitter.com/oOJHtRVoVz
— Lokmat (@lokmat) December 19, 2025
ఇకపోతే, భవనంలో చిరుతపులి తిరుగుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని వీడియోలలో చిరుతపులి ఇళ్ల పైకప్పులపైకి దూకుతున్నట్లు కనిపిస్తుంది, మరికొన్నింటిలో, అది భవనం మెట్లపై కనిపించకుండా దాక్కుంటుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




