AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: ఒకప్పుడు విదేశాల్లో టెకీ.. ఇప్పుడు బిచ్చగాడు..! ఈ ధనవంతుడి విషాద కథ తెలిస్తే..

అతను ఒకప్పుడు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ యూనివర్సిటీలో చదువుకున్నాడు.. ఆ తరువాత బెంగళూరులోని ఓ ప్రముఖ టెక్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేశాడు. అంతలోనే అతని తలరాత పూర్తిగా మారిపోయింది.. ఇప్పుడదే బెంగళూరులోని జయనగర్‌ వీధుల్లో తాగుబోతుగా మారి బిచ్చమెత్తుకునేలా చేసింది. మద్యానికి బానిసైన అతను తన కథను ఇలా చెప్పుకున్నాడు.. తనతో పంచుకున్న విషయాన్ని శరత్‌ యువరాజా అనే యువకుడు తన ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో అందరినీ కలచివేస్తోంది.

Viral video: ఒకప్పుడు విదేశాల్లో టెకీ.. ఇప్పుడు బిచ్చగాడు..! ఈ ధనవంతుడి విషాద కథ తెలిస్తే..
Bengaluru Engineer Beggar
Jyothi Gadda
|

Updated on: Dec 18, 2025 | 4:10 PM

Share

దిల్ హై తుమ్హారా అనే హిందీ సినిమాలోని ఫేమస్‌ సాంగ్‌… ఓ సాహిబా..‌ మీరు వినే ఉంటారు. ఈ పాటలోని ప్రతి లైన్ ప్రస్తుతం బెంగళూరు వీధుల్లో భిక్షాటన చేస్తున్న వ్యక్తికి సరిపోతుంది. ఒక బహుళజాతి కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఇంజనీర్ ఎలా బిచ్చగాడు అయ్యాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వీధి బిచ్చగాడు తన కష్టాలను వివరించాడు. అది విన్న ప్రతి ఒక్కరి కళ్లు కన్నీళ్లతో నిండిపోతున్నాయి. విదేశాలలో ఉన్నత చదువులు చదువుకున్న ఆ వ్యక్తి.. నేడు బెంగళూరు వీధుల్లో బిచ్చగాడిలా మారిపోయాడు.. దానికి కారణం అతను కోల్పోయిన ప్రేమ. ఆ కథంటో వివరంగా తెలుసుకుందాం..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అందరినీ కదిలించింది. బెంగళూరు వీధుల్లో ఒక బిచ్చగాడు ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని అనర్గళంగా ఇంగ్లీషులో వివరిస్తున్నాడు. ఆ వ్యక్తి తాను ఒకప్పుడు బహుళజాతి కంపెనీలో ప్రొడక్ట్ ఇంజనీర్‌గా ఉన్నానని, కానీ, కాలం చేసిన గాయం తనను ఇలా బిచ్చగాడిలా మార్చిందని చెప్పాడు. వీడియో చేస్తున్న వ్యక్తికి ఆసక్తి కలిగింది. కెమెరామెన్‌కు కూడా తాను ఏం వినబోతున్నాడో తెలియదు. కానీ, ఆ వ్యక్తి చెప్పినది తెలిస్తే మీరు కూడా చలించిపోతారు.

ఇవి కూడా చదవండి

వీడియోలో కనిపించిన వ్యక్తి ముందు నుండి తాగుబోతు కాదు.. విదేశాల్లో చదువుకున్న అతడు తను ప్రేమించిన అమ్మాయికి దూరమయ్యాడట. ఆ తరువాత తల్లిదండ్రులను కూడా కోల్పోయాడని తెలిసింది. అలా ఒకదాని వెంట ఒకటిగా వచ్చిన కష్టాలను తట్టుకోలేని ఈ ఇంజనీర్ జీవితం ఒక్కసారిగా తలకిందులుగా మారిపోయింది. వరుస విషాదాలు, దుఃఖాన్ని అధిగమించడానికి, అందరూ చేసేదే అతను చేశాడు. మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించడం ద్వారా తన దుఃఖాన్ని అధిగమించడానికి ప్రయత్నించాడు. చివరికి, అతని పరిస్థితి విషమించింది. పూర్తిగా తాగుబోతుల మారిపోయాడు. ఎప్పుడూ తాగిన మైకంలోనే వీధుల్లో తిరగడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అతన్ని ఓ వ్యక్తి వీడియో రికార్డ్‌ చేస్తూ మాట్లాడించే ప్రయత్నం చేశాడు..ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో బెంగళూరులోని జయనగర్ ప్రాంతం నుండి వచ్చింది.. భిక్షాటన ద్వారా జీవనోపాధి పొందుతున్న ఈ వ్యక్తి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుండి తన MSc పూర్తి చేశాడని తెలిసింది. ఐన్‌స్టీన్‌ మొదలుకుని పలువురు తత్వవేత్తల దాకా అందరి గురించీ అతను అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ధ్యానం, తత్వశాస్త్రం, సైన్స్‌ వంటి అంశాలపై లోతైన వ్యాఖ్యలు చ్తేస్తున్నాడు. కానీ, తల్లిదండ్రులను కోల్పోవడం తనను మద్యం మత్తులోకి నెట్టింది. అది అదుపు తప్పి ఈ గతి పట్టింది. నిరాశ్రయుడిగా మారి బతకడం కోసం భిక్షాటన చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు.

వీడియో ఇక్కడ చూడండి..

sharath_yuvaraja_official అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోను 500,000 కంటే ఎక్కువ సార్లు చూశారు. చాలా మంది వీడియోపై స్పందించారు. చాలా మంది ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. సదరు వ్యక్తికి సహాయం చేయగల వారు ఎవరైనా ఉన్నారా? అని రాశారు. మరొక వీడియో చూసిన వెంటనే స్పందిస్తూ…దేవుడు ఎవరికీ అలాంటి దుఃఖాన్ని ఇవ్వకూడదు అని రాశారు. మరొక వినియోగదారు స్పందిస్తూ.. ఇలాంటి రీల్స్ తయారు చేయడానికి బదులుగా, సదరు వ్యక్తికి సహాయం చేయడం మంచిది అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..