బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
బాదం తొక్కతో పాటు తినాలా, లేక తొక్క తీసి తినాలా అనే సందేహం చాలా మందిలో ఉంది. నిపుణుల ప్రకారం, బాదం తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి. రోజు రాత్రి నానబెట్టిన 5-7 బాదంపప్పులను ఉదయం ఖాళీ కడుపుతో, తొక్కతో సహా బాగా నమిలి తినడం వల్ల గుండె ఆరోగ్యానికి, ఎముకల బలానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.

బాదం తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. అందుకే బాదం పప్పు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. కానీ, బాదం తొక్కతో పాటు తినలా..? లేదంటే తొక్క తీసేసి తినాలా..? అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..
బాదం తొక్కతో కలిపి తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. బాదం తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది. మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియను నిర్వహించడంలో చాలా సహాయకారిగా ఉంటుంది.
అయితే, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు 5 నుండి 7 బాదంపప్పులను శుభ్రమైన నీటిలో నానబెట్టి, మరుసటి రోజు తినండి. ఉదయం ఖాళీ కడుపుతో బాదంపప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి. కానీ వాటిని త్వరగా మింగేయకుండా బాగా నమిలి తినాలని నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజూ బాదం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అంతేకాదు.. బాదం పప్పులో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండే బాదం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అవి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. పేగులను శుభ్రంగా ఉంచుతాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








