AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: అమావాస్య రోజున కొత్త చీపురు కొనొచ్చా..? లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఇలా చేయండి..

ఆనందం, శ్రేయస్సు, ఆర్థిక సమస్యల నివారణకు వాస్తు శాస్త్రం ఎన్నో విషయాలను చెబుతోంది.. ఇంటి వాస్తు, ఇంట్లో వస్తువుల వాస్తు సరిగ్గా ఉంటే, ఆ ఇంట్లో ఎల్లప్పుడూ మానసిక ప్రశాంతత ఉంటుందని.. సిరి సంపదలకు లోటుండదని నమ్ముతుంటారు. అందుకే.. లక్ష్మీదేవికి ప్రతీకగా భావించే చీపురు విషయంలో తప్పులు చేయకూడదని.. వాస్తుశాస్త్రం పండితులు చెబుతున్నారు.

Vastu Tips: అమావాస్య రోజున కొత్త చీపురు కొనొచ్చా..? లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఇలా చేయండి..
Broom Vastu
Shaik Madar Saheb
|

Updated on: Dec 18, 2025 | 8:57 AM

Share

ఆనందం, శ్రేయస్సు, ఆర్థిక సమస్యల నివారణకు వాస్తు శాస్త్రం ఎన్నో విషయాలను చెబుతోంది.. ఇంటి వాస్తు, ఇంట్లో వస్తువుల వాస్తు సరిగ్గా ఉంటే, ఆ ఇంట్లో ఎల్లప్పుడూ మానసిక ప్రశాంతత ఉంటుందని.. సిరి సంపదలకు లోటుండదని నమ్ముతుంటారు. అందుకే.. లక్ష్మీదేవికి ప్రతీకగా భావించే చీపురు విషయంలో తప్పులు చేయకూడదని.. వాస్తుశాస్త్రం పండితులు చెబుతున్నారు. వాస్తవానికి హిందూ మతంలో చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు.. ఎందుకంటే.. చీపురు ఇంటిని శుభ్రం చేసి చెడును పారద్రోలుతుంది.. శుభ్రమైన ఇల్లు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి, వాస్తు, జ్యోతిష్యం ప్రకారం చీపురును సరిగ్గా ఉపయోగించడం, ఉంచడం వల్ల ఇంట్లో సంపద, సుఖశాంతులు పెరుగుతాయి. చీపురును అవమానించడం, తలకిందులుగా ఉంచడం వంటివి చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై దరిద్రం వస్తుందని నమ్ముతుంటారు. అందుకే.. లక్ష్మీదేవి అడుగుపెట్టాలన్నా, సిరి సంపదలు పెరగాలన్నా చీపురు విషయంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.. అయితే.. వాస్తుశాస్త్రం ప్రకారం.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చీపురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి.. అనే విషయాలను తెలుసుకుందాం..

చీపురు ఏ రోజు కొనాలి..

వాస్తు శాస్త్రం ప్రకారం.. కొత్త చీపురు కొనడానికి మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం మంచి రోజులు.. వీటితోపాటు.. ముఖ్యంగా దీపావళి వంటి పండుగ రోజు లేదా ధన త్రయోదశి రోజు కొనడం శుభప్రదం.. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, సంపదను తెస్తుందని, ఆర్థిక సమస్యలను తొలగించి, ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుందని పేర్కొంటున్నారు పండితులు..

అమావాస్య రోజు చీపురు కొనవచ్చా.. ?

చీపురును అమావాస్య రోజు కూడా కొనవచ్చు.. కానీ.. కృష్ణ పక్షంలో కొంటే మంచిదని పండితులు పేర్కొంటున్నారు. సాధారణ అమావాస్యలలో కొనడం మంచిది కాదు.. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆర్థిక నష్టాలు వస్తాయని పేర్కొంటున్నారు.

ఇంకా.. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును ఇంట్లో సరైన స్థలంలో ఉంచడం కూడా ముఖ్యం.. ఇంట్లో చీపురును దక్షిణ భాగం, వాయువ్యం.. లేదంటే పడమర, నైరుతి దిక్కులో ఉంచాలి.. అలాగే.. చీపురు పడుకోబెట్టి ఉంచాలి.. ఎవరికీ కనిపించకుండా ఉంచాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, శ్రేయస్సు పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి
ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి
చికెన్ లెగ్ పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న..
చికెన్ లెగ్ పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న..
చైనాకు చెక్‌? అమెరికా నుంచి భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం!
చైనాకు చెక్‌? అమెరికా నుంచి భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం!
AP SET 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
AP SET 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. చలికాలంలో ఈ పండ్లు తింటే ఈజీగా బరువు..
జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. చలికాలంలో ఈ పండ్లు తింటే ఈజీగా బరువు..
EV బ్యాటరీ ప్యాక్‌లపై ఆధార్‌ నంబర్‌ ఎందుకంత ముఖ్యం!
EV బ్యాటరీ ప్యాక్‌లపై ఆధార్‌ నంబర్‌ ఎందుకంత ముఖ్యం!
విగ్రహం కింద గుప్త నిధుల ఉన్నాయంటూ తవ్వకాలు.. తీరా తీసి చూస్తే..
విగ్రహం కింద గుప్త నిధుల ఉన్నాయంటూ తవ్వకాలు.. తీరా తీసి చూస్తే..
నెలకు రూ.55,932 జీతంతో.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో కొలువులు
నెలకు రూ.55,932 జీతంతో.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో కొలువులు
పెట్టుబడిదారులకు లాభాల పంట పండించిన కండోమ్స్‌ కంపెనీ!
పెట్టుబడిదారులకు లాభాల పంట పండించిన కండోమ్స్‌ కంపెనీ!
కాఫీ ఈ టైంలో తాగారంటే.. మీకు ఆరోగ్య సమస్యలు రానేరావు!
కాఫీ ఈ టైంలో తాగారంటే.. మీకు ఆరోగ్య సమస్యలు రానేరావు!