AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో గుప్పెడు మొలకెత్తిన గింజలు తింటే..శరీరంలో జరిగే మార్పులు..!

ఈ రోజుల్లో చాలా మంది ఫిట్‌నెస్ పట్ల అవాహన కలిగి ఉన్నారు. అందుకే చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం అలవాటు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కొందరు తమ రోజువారి ఆహారంలో మొలకెత్తిన ధాన్యాలను చేర్చుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. మొలకలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అవి శరీరానికి శక్తిని అందిస్తాయి. శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మీరు వాటిని అల్పాహారం, సలాడ్లు, సూప్‌లు లేదా ఆరోగ్యకరమైన చిరుతిండిగా కూడా తినవచ్చు. మొలకెత్తిన గింజలను ఉదయాన్నే తినడం వలన రెట్టింపు లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం...

రోజు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో గుప్పెడు మొలకెత్తిన గింజలు తింటే..శరీరంలో జరిగే మార్పులు..!
Sprouts
Jyothi Gadda
|

Updated on: Dec 17, 2025 | 7:50 PM

Share

మొలకలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే పోషకాల నిధి. అవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మీరు మీ ఆహారంలో ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని చేర్చాలనుకుంటే మొలకలను సలాడ్స్‌గా, స్పైసీగా వీటిని తీసుకోవచ్చు. మొలకెత్తిన గింజలపై చిటికెడు ఉప్పు,నిమ్మరసం, స్పైసీగా చేసుకుని తినవచ్చు.

మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ సమృద్దిగా ఉండటం వలన రోగినిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి,ఈ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్ సమృద్దిగా ఉన్నటువంటి మొలకెత్తిన గింజలను తినడం వలన కడుపు నిండుగా అనిపిస్తుంది. దీని వలన శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండేటువంటి మొలకెత్తిన గింజలు తినడం వలన గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఫైబర్, ఎంజైములు సమృద్దిగా ఉన్నటువంటి మొలకెత్తిన గింజలు తినడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపు నిండుగా అనిపిస్తుంది. మొలకెత్తిన విత్తనాల్లో పెసలు, శనగలు, పల్లీలు, మెంతులు, కిడ్నీ బీన్స్ వంటి మొలకెత్తిన ధాన్యాలు ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్‌ అవుతుంది. ప్రోటీన్, ఫైబర్, ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉన్న మొలకలు మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాటిని మరింత రుచికరంగా చేయడానికి, మీరు ఉల్లిపాయ, టమోటా, నిమ్మకాయ, దోసకాయ వంటి పదార్థాలను కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మొలకలు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇనుము, రాగితో సమృద్ధిగా ఉంటాయి. మొలకలు తినడం వల్ల గ్లూటెన్‌కు సున్నితంగా ఉండే వ్యక్తులకు ప్రయోజనకరం. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. మొలకలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషవ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. మలబద్ధకం, కడుపు సమస్యలను నివారిస్తాయి. మొలకలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు గొప్ప మూలం. ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. హృదయ సంబంధ వ్యాధులు, అధిక క్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.

మొలకలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. మొలకలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటి కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా వాటిని దెబ్బతినకుండా కాపాడతాయి. రక్తహీనత ఉన్న రోగులు మొలకలు తినాలి. ఎందుకంటే వాటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా, అవి ఎర్ర రక్త కణాల సంఖ్యను బాగా నిర్వహించడానికి సహాయపడతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..