అలర్ట్..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
భారతీయ రైల్వే రైలు టికెట్ల రద్దు, రిఫండ్ విధానంలో ఏప్రిల్ 1 నుండి కీలక మార్పులు అమలు చేసింది. రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు టికెట్ రద్దు చేసుకుంటే ఎలాంటి రిఫండ్ లభించదు. టికెట్ దళారుల అక్రమాలను అరికట్టడం, నిజమైన ప్రయాణికులకు బెర్త్‌లు అందుబాటులో ఉంచడమే దీని ఉద్దేశ్యం. బోర్డింగ్ పాయింట్ మార్చుకునే సౌలభ్యం కూడా పెరిగింది.
భారతీయ రైల్వే రైలు టికెట్ల రద్దు, రిఫండ్ విధానంలో కీలకమైన మార్పులను ఏప్రిల్ 1 నుండి అమలులోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనలు ప్రయాణికులకు స్పష్టమైన అవగాహన కల్పించనున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం, రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు కన్ఫర్మ్ అయిన టికెట్‌ను రద్దు చేసుకుంటే ప్రయాణికులకు ఎలాంటి రిఫండ్ లభించదు. గతంలో ఈ గడువు నాలుగు గంటలుగా ఉండేది. ప్రయాణానికి 8 గంటల నుంచి 24 గంటల మధ్యలో టికెట్‌ను రద్దు చేస్తే టికెట్ ధరలో 50 శాతం మాత్రమే తిరిగి వస్తుంది. అదేవిధంగా, 24 గంటల నుంచి 72 గంటల ముందు రద్దు చేసుకుంటే 25 శాతం కోత విధించి, 75 శాతం మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. ఒకవేళ ప్రయాణానికి 72 గంటల కంటే ముందే టికెట్‌ను రద్దు చేస్తే కేవలం సాధారణ రద్దు చార్జీలు మాత్రమే వర్తిస్తాయి. టికెట్ ఏజెంట్లు, దళారులు పెద్ద సంఖ్యలో టికెట్లను బ్లాక్ చేసి చివరి నిమిషంలో రద్దు చేయడాన్ని అరికట్టేందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. దీనివల్ల నిజమైన ప్రయాణికులకు చివరి నిమిషంలో కూడా బెర్త్‌లు అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త నిబంధ
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా
మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్
దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం
ప్రాచీన శివాలయానికి జాతీయ హోదా!
చైనాలో గుడ్డు కూర ధర ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ..

