నయనతార, తమన్నా, త్రిష వంటి అగ్రతారలు దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమల్లో సీనియర్ హీరోలతో జోడీ కడుతూ తమ స్టార్‌డమ్‌ను కొనసాగిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దర్శక నిర్మాతలకు సులభతరం చేస్తున్నారు. శ్రేయ శరణ్, మంజు వారియర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.