AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niharika Konidela : నిర్మాతగా వరుస హిట్స్.. యాక్టింగ్‏కు గుడ్ బై చెప్పేస్తారా.. ? నిహారిక ఆన్సర్ ఇదే..

నిహారిక కొణిదెల.. బుల్లితెరపై యాంకర్ గా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కథానాయికగా వెండితెరపై సందడి చేసింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించిన ఆమె.. ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు. చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తూ భారీ విజయాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలో తన యాక్టింగ్ కెరీర్ పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Niharika Konidela : నిర్మాతగా వరుస హిట్స్.. యాక్టింగ్‏కు గుడ్ బై చెప్పేస్తారా.. ? నిహారిక ఆన్సర్ ఇదే..
Niharika Konidela
Rajitha Chanti
|

Updated on: Apr 02, 2026 | 5:31 PM

Share

మెగా వారసురాలిగా వెండితెరకు పరిచయమైన నిహారిక కొణిదెల, ప్రస్తుతం టాలీవుడ్‌లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, నిర్మాతగానూ రాణిస్తున్నారు. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై విలక్షణమైన చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తాజాగా ఆమె నిర్మాణంలో రూపొందిన ‘రాకాస’ (Rakasa) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, లక్ష్యాలు, వ్యక్తిగత అనుభవాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమా ఒక నిశబ్ధ విప్లవం.. తెలుగులోనే వచ్చిన గొప్ప చిత్రం.. తనికెళ్ల భరణి కామెంట్స్..

యూట్యూబ్ వెబ్ సిరీస్‌లతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన నిహారిక, అతి తక్కువ సమయంలోనే వెండితెర నిర్మాతగా ఎదిగారు. ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు, పరిశ్రమకు పలువురు కొత్త నటీనటులను పరిచయం చేసింది. “కేవలం వారసత్వం ఉంటే సరిపోదు, ప్యాషన్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలమని” ఆమె నమ్ముతారు. తాజాగా ఏప్రిల్ 3న విడుదల కానున్న ‘రాకాస’ చిత్రంపై ఆమె ఎంతో నమ్మకంగా ఉన్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హర్రర్ కామెడీ ఫాంటసీ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మానస శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఎక్కువ మంది చదివినవి : Meena: ఏంటీ మేడమ్ మీరు.. మీనా ఎంతవరకు చదువుకుందో తెలుసా.. ? అసలు విషయం చెప్పిన హీరోయిన్.

నటిగా తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. పాత్ర చిన్నదా, పెద్దదా అని కాకుండా, కథలో దానికి ఉన్న ప్రాధాన్యతను మాత్రమే చూస్తానని నిహారిక స్పష్టం చేశారు. కొన్నిసార్లు దర్శకులు తాను కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే చేస్తానని భావించి కొన్ని మంచి స్క్రిప్టులు తీసుకురావడం లేదని, అది తనను కాస్త బాధకు గురిచేస్తోందని పేర్కొన్నారు. “సుహాస్ వంటి చిన్న హీరోల పక్కన నటించనని కొందరు ముందే ఊహించుకుంటున్నారు, కానీ కథ బాగుంటే ఎవరితోనైనా నటించడానికి నేను సిద్ధం” అని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ చిత్ర పరిశ్రమలోనూ మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తనపై వచ్చే విమర్శలను పట్టించుకోవడం మానేశానని, తనకు నచ్చిన పనిని తాను చేస్తూనే ఉంటానని నిహారిక ధీమాగా చెప్పారు. మంచి పాత్రలు వస్తే నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇండియాలో నిజంగా జరిగిన కథ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

ఎక్కువ మంది చదివినవి : RGV : సినిమా చండాలంగా ఉంది.. కుదిరితే ఆపేయ్యమని చెప్పారు.. కానీ.. ఇండస్ట్రీని షేక్ చేసింది.. రామ్ గోపాల్ వర్మ..

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు