ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బోయపాటి శ్రీను, కొరటాల శివ, హరిష్ శంకర్ల కెరీర్ ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కొంటోంది. వరస వైఫల్యాలతో వారి తదుపరి చిత్రాలపై సందిగ్ధత నెలకొంది. వినాయక్, కృష్ణవంశి లాంటి దర్శకులకు ఎదురైన పరిస్థితే వీరికీ ఎదురవుతుందా? లేదా హిట్ ఇచ్చి నిరూపించుకుంటారా అనేది వేచి చూడాలి.