AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ears Health: ప్రతిరోజూ చెవులు శుభ్రం చేస్తున్నారా? అయితే, మీరు ప్రమాదంలో పడ్డట్లే! డాక్టర్ల హెచ్చరిక ఇదే..

మనం మన శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, చెవులను కూడా అలాగే ఉంచుకోవాలని అనుకుంటాం. చెవిలో కొద్దిగా గుబిలి కనిపించినా వెంటనే కాటన్ బడ్స్ లేదా పిన్నులతో తీసేస్తుంటాం. అయితే, ఈ అలవాటు వల్ల చెవికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని తెలిస్తే షాక్‌ అవుతారు. ప్రతిరోజూ చెవులను శుభ్రం చేసుకోవడం లేదా చెవిలో గుబిలిని (Earwax) తొలగించడం వల్ల కలిగే నష్టాల గురించి వైద్యులు హెచ్చరిస్తున్నారు. మనం శుభ్రత అనుకునే ఈ అలవాటు నిజానికి చెవి ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చునని అంటున్నారు. అదేలాగో పూర్తి డిటెల్స్‌లోకి వెళ్దాం..

Ears Health: ప్రతిరోజూ చెవులు శుభ్రం చేస్తున్నారా? అయితే, మీరు ప్రమాదంలో పడ్డట్లే! డాక్టర్ల హెచ్చరిక ఇదే..
Ear Cleaning Risks
Jyothi Gadda
|

Updated on: Apr 02, 2026 | 5:42 PM

Share

చెవి గులిమి అనేది ఒక సహజ ప్రక్రియ. మన శరీరంలో దీనికి ఒక ముఖ్యమైన విధి ఉంది. పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించే చాలా మంది తమ చెవులను శుభ్రం చేసుకుంటారు. కొందరు వారానికి ఒకసారి ఇలా చేస్తే, మరికొందరు ప్రతిరోజూ చేస్తారు. చాలా మంది ఖాళీగా కూర్చున్నప్పుడు చెవులు శుభ్రం చేసుకోవడాన్ని ఆనందిస్తారు. కొందరు చెవులను శుభ్రం చేసుకోవడానికి నూనె వేసుకుంటే, మరికొందరు ఇయర్‌బడ్స్‌ను ఉపయోగిస్తారు. కొందరు అగ్గిపుల్ల చుట్టూ దూదిని చుట్టి దానితో చెవులను శుభ్రం చేసుకుంటారు. శరీరం ఎలాగైతే శుభ్రంగా ఉండాలో, చెవులు కూడా అలాగే శుభ్రంగా ఉండాలని ప్రజలు నమ్ముతారు. కానీ, వైద్యుల ప్రకారం చెవిలోని గులిమి (Earwax) నిజానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు.

గులిమి (Earwax) ఎందుకు అవసరం?:

చాలామంది గులిమిని ఒక మురికిలా భావిస్తారు. కానీ అది చెవికి ఒక సెక్యూరిటీ గార్డు లాంటిది. ఇది చెవి లోపలి భాగాన్ని తేమగా ఉంచుతుంది. బాహ్య కారకాలైన దుమ్ము, పురుగులు, వైరస్లు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. పదేపదే శుభ్రం చేయడం వల్ల తీవ్రమైన నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఒక్కోసారి కాటన్ బడ్స్ వాడటం వల్ల గుబిలి బయటకు రాకపోగా, అది కర్ణభేరి (Eardrum) వైపు నెట్టబడుతుంది. దీనివల్ల వినికిడి తగ్గడం లేదా చెవిలో శబ్దాలు రావడం (Tinnitus) జరుగుతుంది. అంతేకాదు.. చెవి లోపలి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. పదునైన వస్తువులు లేదా బడ్స్ వల్ల అక్కడ చిన్న గాయాలు ఏర్పడి, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. మనం మాట్లాడేటప్పుడు లేదా ఆహారం నమిలేటప్పుడు దవడల కదలిక ద్వారా పాత గులిమి సహజంగానే బయటకు వచ్చేస్తుంది. మనం బలవంతంగా తీయాల్సిన అవసరం లేదు.

సురక్షితంగా ఎలా ఉండాలి?

స్నానం చేసిన తర్వాత చెవి బయటి భాగాన్ని మెత్తని తువ్వాలుతో తుడుచుకుంటే సరిపోతుంది. చెవి లోపల ఏదైనా వస్తువును చొప్పించకండి. ఒకవేళ చెవిలో గులిమి పేరుకుపోయి నొప్పిగా ఉంటే లేదా వినికిడి ఇబ్బందిగా ఉంటే, సొంత ప్రయోగాలు చేయకుండా ఇఎన్‌టి (ENT) డాక్టరును సంప్రదించి ఇయర్ డ్రాప్స్ వాడటం ఉత్తమం. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా, శుభ్రత విషయంలో కూడా అతిగా ప్రవర్తించడం చెవికి శాశ్వత నష్టాన్ని కలిగించవచ్చు. సహజ సిద్ధమైన ప్రక్రియను గౌరవించడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే