AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్‌ బ్రో.. వేస్ట్‌గా పడేసే ఇంజిన్ ఆయిల్​తో వంటలు.. ఆయిల్ స్టవ్ ఐడియాకు నెటిజన్లు ఫిదా!

దేశవ్యాప్త ఎల్‌పిజి కొరత నేపథ్యంలో ఒక జలేబీ విక్రేత కనుగొన్న ఒక వినూత్న పరిష్కారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతను పారేసిన ఇంజన్ ఆయిల్ (వేస్ట్ మోబిల్)తో ఒక స్టవ్‌ను తయారు చేసి, దానిపై జలేబీలు తయారు చేసి అమ్ముతున్నాడు. ఈ దుకాణదారుడి కథ కష్టకాలంలో కూడా ప్రజలు తమ చాతుర్యం, కృషి ద్వారా బయటపడగలరని నిరూపిస్తుంది. ప్రజలు సంక్షోభంతో సతమతమవుతుండగా, మరికొందరు దానిలోనే కొత్త అవకాశాలను వెతుక్కుంటున్నారు.

సూపర్‌ బ్రో.. వేస్ట్‌గా పడేసే ఇంజిన్ ఆయిల్​తో వంటలు.. ఆయిల్ స్టవ్ ఐడియాకు నెటిజన్లు ఫిదా!
Waste Engine Oil Cooking
Jyothi Gadda
|

Updated on: Apr 02, 2026 | 3:20 PM

Share

భారతదేశంలో టాలెంట్‌కు కొదవలేదు, ముఖ్యంగా ఏదైనా సమస్య వస్తే భారతీయులు చేసే జుగాడ్ పనులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా ప్రయాగ్‌రాజ్‌లో ఒక జలేబీ వ్యాపారి చేసిన పని కూడా అలాంటిదే. గ్యాస్ ధరల సెగ నుండి తప్పించుకోవడానికి అతను కనుగొన్న మార్గం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన జలేబీ బండి వద్ద గ్యాస్ సిలిండర్ లేకుండానే వంట చేస్తున్నాడు. అతను ఇంధనంగా దేనిని వాడుతున్నాడో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వాహనాల సర్వీసింగ్ తర్వాత మిగిలిపోయే వేస్ట్ మోబిల్ ఆయిల్ (Used Mobil Oil) ను అతను మంట పుట్టించడానికి వాడుతున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒక వీధి వ్యాపారి గ్యాస్ సిలిండర్ ఖర్చును తగ్గించుకోవడానికి ఒక వినూత్నమైన, కానీ ప్రమాదకరమైన ఆలోచనను అమలు చేశాడు. సాధారణంగా వాహనాల్లో వాడి పారేసే వేస్ట్ మోబిల్ ఆయిల్ (Used Engine Oil) ను ఇంధనంగా వాడుతూ జలేబీలు వండుతున్నాడు. దీని కోసం అతను ఒక చిన్న సెటప్‌ను తయారు చేసుకున్నాడు. ఒక డబ్బాలో నల్లటి మోబిల్ ఆయిల్‌ను పోసి, దానికి సైకిల్ పంప్ లాంటి పరికరాన్ని అమర్చాడు. పంప్ ద్వారా గాలిని ఒత్తిడితో పంపినప్పుడు, ఆయిల్ మంటగా మారి పెద్ద ఎత్తున వేడిని పుట్టిస్తోంది. దీనివల్ల అతనికి గ్యాస్ సిలిండర్ ఖర్చు పూర్తిగా మిగిలిపోతోంది. సోషల్ మీడియాలో వీడియో విపరీతతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు అతని తెలివితేటలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకు లక్షలాది వ్యూస్ వస్తున్నప్పటికీ, విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వాడిన ఇంజిన్ ఆయిల్ మండటం వల్ల వెలువడే పొగలో సీసం (Lead), ఇతర ప్రమాదకర రసాయనాలు ఉంటాయి. ఇవి నేరుగా జలేబీలపై పడటం వల్ల అవి విషపూరితంగా మారే అవకాశం ఉందని చాలా మంది నెటిజన్లు పేర్కొన్నారు. నల్లటి పొగ గాలిని విపరీతంగా కలుషితం చేస్తుంది. ఇలాంటి పద్ధతుల్లో మంటను అదుపు చేయడం కష్టం, ఇది అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కష్టాల్లో ఉన్నప్పుడు కొత్త దారులు వెతకడం మంచిదే కానీ, అది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా ఉండకూడదని అధికారులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వింత ప్రయోగాలు చేసేటప్పుడు భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us