AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతి తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీలు.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు..

ప్రస్తుతం పెట్రోల్ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఆఫీసు పనులకైనా, ఇంటి అవసరాలకైనా వాహనం తీయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారాయి. మార్కెట్లో లక్షలాది రూపాయల ఈవీలు ఉన్నప్పటికీ, సామాన్యుడి బడ్జెట్‌కు సరిపోయేలా, లక్ష రూపాయల లోపు లభించే ఐదు అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Apr 02, 2026 | 4:49 PM

Share
బజాజ్ చేతక్ 3001: భారతీయ రోడ్లపై ఒకప్పుడు రారాజుగా వెలిగిన చేతక్, ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో అదరగొడుతోంది. ఈ స్కూటర్ ధర సుమారు రూ. 99,990 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇందులో 3 kWh బ్యాటరీ ఉండటం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 127 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. మెటల్ బాడీతో చాలా దృఢంగా ఉండే ఈ స్కూటర్‌లో హిల్-హోల్డ్ అసిస్ట్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

1 / 5
జెలియో ఎక్స్ మెన్ 2.0: స్టైలిష్ లుక్, ఎక్కువ మైలేజీ కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక. దీని ధర సుమారు రూ.92,000 ఉంటుంది. ఇందులో అమర్చిన పవర్‌ఫుల్ బ్యాటరీ ఏకంగా 120 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ చాలా తేలికగా ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్‌లో సులభంగా దూసుకెళ్లవచ్చు. ముఖ్యంగా పార్కింగ్ చేయడంలో ఇబ్బంది పడే వారికి దీని రివర్స్ అసిస్ట్ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

2 / 5
ఆంపియర్ మాగ్నస్ EX: నమ్మకమైన ఈవీ బ్రాండ్లలో ఒకటైన ఆంపియర్ నుండి వచ్చిన ఈ మోడల్ ధర రూ. 84,900 గా ఉంది. ఫ్యామిలీ అవసరాలకు అంటే కూరగాయలు తేవడానికి లేదా ఇంటి పనుల కోసం ఇది చాలా పర్ఫెక్ట్ వెహికల్. ఇది ఒక్క ఛార్జ్‌పై 80 నుండి 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని సీటు చాలా వెడల్పుగా, సౌకర్యవంతంగా ఉండటం వల్ల పెద్ద వయసు వారు కూడా దీనిని సులభంగా నడపవచ్చు.

3 / 5
ఓకినావా ప్రైజ్ ప్రో: సిటీలో కొంచెం వేగంగా ప్రయాణించాలనుకునే వారికి ఈ స్కూటర్ సరిగ్గా సరిపోతుంది. దీని ధర సుమారు రూ. 84,443. ఇది గంటకు 56 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అందుకుంటుంది. ఒక్క ఛార్జ్‌పై 81 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. దీని బ్యాటరీని కేవలం 2 నుంచి 3 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. సెంట్రల్ లాకింగ్, యాంటీ-థెఫ్ట్ అలారం వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఇందులో ఉండటం విశేషం.

4 / 5
కైనెటిక్ గ్రీన్ జింగ్ బిగ్ బి: అత్యంత తక్కువ ధరలో ప్రాక్టికల్ స్కూటర్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని ధర కేవలం రూ.75,990 మాత్రమే. ఇది 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇందులో డిటాచబుల్ బ్యాటరీ ఉండటం వల్ల మీరు బ్యాటరీని ఇంటికి తీసుకెళ్లి మొబైల్ లాగా ఛార్జ్ చేసుకోవచ్చు. దీని తక్కువ వేగం కారణంగా నిబంధనలను బట్టి దీనికి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదని సమాచారం.

5 / 5
Follow Us
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!

ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..

భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..

సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..