కర్ణాటకలోని మైసూరు జిల్లా హున్సూర్ ప్రాంతంలో దేవుడి ముందుంచిన మందారపువ్వు గొంతులో ఇరుక్కుని ఆరున్నర నెలల చిన్నారి చిన్మయ్ గౌడ మృతి చెందాడు. ఆహారం అనుకొని పువ్వు కాడను నమిలి మింగాడు. అది వాయునాళానికి అడ్డుపడి ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులు సుదర్శన్, నవ్యల రెండో కుమారుడు చిన్మయ్ గౌడ.