సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు అమ్మాయిల హవా కనిపిస్తుంది. మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు తెలుగు ముద్దుగుమ్మలు.
వారిలో శాన్వి మేఘన ఒకరు. ఈ ముద్దుగుమ్మ 1998 సెప్టెంబరు 12న హైదరాబాద్‌లో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ 2019లో సైరా నరసింహారెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది
ఆ తర్వాత “పిట్ట కథలు”, “బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్”, “పుష్పక విమానం”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
తెలుగులో ఈ అమ్మడు ఇప్పటివరకు ఆరు సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లో ఓ సినిమా చేసింది. తమిళ్ లో ఆమె కుటుంబస్థాన్ అనే సినిమాలో నటించింది.
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చేసిన సినిమాలన్ని మంచి టాక్ సొంతం చేసుకున్నా ఈ భామకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు.
సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది ఈ అమ్మడు. ఇప్పటికైన ఈ అమ్మడికి పెద్ద సినిమా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.
తెలుగులో ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అందంతో కవ్విస్తుంది శాన్వి మేఘన