అవకాశాలు కాదు.. స్టార్ ఇమేజ్ కావాలంటున్న అందాల భామలు
అవకాశాలు వచ్చినా, తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ ఇమేజ్ సాధించడం కొందరు నటీమణులకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్, నిధి అగర్వాల్, భాగ్యశ్రీ బోర్సే, మీనాక్షి చౌదరి వంటి హీరోయిన్లు పాత్రలు చేస్తున్నా, స్టార్ గుర్తింపు కోసం పోరాడుతున్నారు. వారి కెరీర్‌లో ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటున్నారో పరిశీలిద్దాం.
తెలుగు సినీ పరిశ్రమలో నటీమణులకు అవకాశాలు రావడం ఒక ఎత్తు, స్టార్ ఇమేజ్ సాధించడం మరొక ఎత్తు. స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడే నటీమణులు ఎక్కువ కాలం గుర్తుండిపోతారు. అలాగే మంచి పారితోషికం, మెరుగైన అవకాశాలు లభిస్తాయి. అయితే, కొందరు అందాల భామలకు ఈ స్టార్‌డమ్ అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. వరుస ప్రయోగాలు చేస్తున్న అనుపమ పరమేశ్వరన్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నా, స్టార్ ట్యాగ్ ఇంకా ఆమెను ఊరిస్తూనే ఉంది. నిధి అగర్వాల్, భాగ్యశ్రీ బోర్సే స్టార్ హీరోలతో నటిస్తున్నప్పటికీ, విజయాలు లేకపోవడంతో స్టార్ ఇమేజ్ గురించి ఆలోచించే అవకాశం లేకుండా పోయింది. కెరీర్ ప్రారంభంలో మంచి ఫామ్‌లో కనిపించిన సంయుక్త మీనన్ కూడా స్టార్ లీగ్‌లోకి అడుగు పెట్టడంలో వెనుకబడుతున్నారు. అందుకే ఆమె కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తున్నారు.
వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి
ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!
అరుదైన పెళ్లి వేడుక.. కవల వరులు, కవల వధువులు..
టాయిలెట్ కోసం బ్రేక్ ఇవ్వలేదని దారుణ హత్య..
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు

