Viral: భర్తకు నిద్రమత్తుతో డ్రైవింగ్ సీటులోకి భార్య.. ఇంతలోనే షాక్.! వీడియో..
విహారయాత్ర విషాదంగా మారింది. విహారయాత్రకు వెళ్లి సరదాగా గడిపిన కుటుంబ సభ్యులు ఇంటికి చేరకుండానే విగతజీవులుగా మారిపోయారు. ప్రమాదంలో కుటుంబంలోని ముగ్గురు చనిపోయిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. పోతవరానికి చెందిన విజయ్ కుమార్…భార్య, ఇద్దరు కుమారులతో కలిసి అరకు విహార యాత్రకు వెళ్లారు.
భార్య, ఇద్దరు కుమారులతో కలిసి అరకు విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ఆనందంగా గడిపి తిరిగి రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. రావులపాలెం మండలం ఈతకోట వద్దకు వచ్చేసరికి విజయ్ కుమార్.. నిద్రమత్తుతో కళ్లు మూతలు పడుతున్నాయని కారు రోడ్డు పక్కన ఆపాడు. భార్య ఉమ.. తనకు డ్రైవింగ్ వచ్చు కదా ఇంకా పది కిలోమీటర్ల దూరంలో ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పింది.
దీనికి భర్త సరే అని అనగా.. భార్య ఉమ కార్ డ్రైవింగ్ చేస్తూ పోతవరం బయలుదేరారు. కారు ఊడిముడి వచ్చిన తర్వాత అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో భార్య ఉమ, ఇద్దరు కుమారులు మనోజ్, రిషి మృతి చెందగా… భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. వారి మృతదేహాలను స్థానికులు కాలువ నుంచి బయటకు తీశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మరో ఐదు కిలోమీటర్ల దూరంలో స్వగ్రామం చేరుకుంటారనే సమయంలో వారంతా శవాలుగా మారడం అందర్ని కలచివేసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు . తన కళ్లముందే భార్యాపిల్లలు. కొట్టుకుపోయారని విజయ్ కుమార్ బోరున విలపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

