Viral: నకిలీ ED రైడ్స్ .. గ్యాంగ్ మూవీ సీన్ దింపేశారుగా.! కట్ చేస్తే.. వీడియో.
హీరో సూర్య ‘గ్యాంగ్’ మువీ చూశారా? ఈ మువీలో సూర్య గ్యాంగ్ నకిలీ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారుల పేరిట దాడులు చేసి కోట్ల రూపాయలు దోచుకుంటారు. సేమ్ టు సేమ్ సీన్‌ను.. ఈ దొంగల ముఠా కూడా దించేసింది. వాళ్ల ముఖాల్లో కాన్ఫిడెన్స్ చూస్తే అసలు అధికారులకు కూడా దడ పుడుతుంది. పర్ఫామెన్స్ అలాంటిది మరి. ఈ విచిత్ర సంఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. వీరు రైడ్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గుజరాత్‌లోని కచ్‌లో రాధిక జ్యువెలర్స్ యాజమానికి చెందిన షాపుతో అతని ఇంటిపై నకిలీ ఈడీ అధికారులు దాడులు చేశారు. మొత్తం 12 మంది ఈడీ అధికారులమంటూ దాడులు చేశారు. ఈడీ అధికారిగా ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చి ఐడీ కార్డు చూపించాడు. అకౌంట్ల వివరాలు చెప్పాలని, లేదంటే జైలుకు పంపాల్సి వస్తుందని బెదిరించాడు. బ్యాంకు వివరాలు, బంగారం, నగదు వివరాలు చెప్పేందుకు 15 నిమిషాల టైమ్ ఇచ్చాడు. చివరకు ఆ ముఠా సభ్యులు రూ. 25 లక్షల విలువైన బంగారం, వెండి నగలు, నగదుతో అక్కడి నుంచి ఉడాయించారు.
ఈడీ అధికారిగా నటించిన శైలేంద్ర దేశాయ్ ఫేక్ రైడ్‌కు అసలు సూత్రధారిగా పోలీస్ అధికారి తెలిపారు. ఎస్పీ సాగర్ బాగ్మార్ మాట్లాడుతూ ఫిర్యాదు అందుకున్న వెంటనే గాంధీ ధామ్‌లోని పోలీసులుగాంధీ ధామ్, భుజ్ , అహ్మదాబాద్‌తో సహా వివిధ ప్రాంతాల్లో 10 బృందాలుగా గాలించి నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా కార్యకలాపాలు, ఇతర నేరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను తాళ్లతో కట్టి రోడ్డుపై నడిపించి తీసుకెళ్తున్న వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

