తూర్పు గోదావరి జిల్లాలో భయాందోళనలు సృష్టించిన పెద్దపులి ఇటీవల పట్టుబడటం తెలిసిందే. కుర్మపురం గ్రామంలో బంధించిన ఈ పులికి విశాఖ జూ వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రేడియో కాలర్ అమర్చారు. అనంతరం పాపికొండల అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు. ఈ చర్యతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.