IPL History: ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్.. ఆ తోపు టీంలకే సాధ్యంకాని రికార్డ్..
IPL History: ఐపీఎల్‌లో టైటిల్స్ కంటే ఆర్థిక విలువే సక్సెస్‌గా మారుతున్న వేళ, రాజస్థాన్ రాయల్స్ సరికొత్త చరిత్ర సృష్టించనుంది. జైపూర్ కేంద్రంగా పనిచేసే ఈ జట్టు ఒక బిలియన్ డాలర్ల (రూ. 9,215 కోట్లు) మార్కును దాటిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా నిలవనుంది. గ్లోబల్ ఇన్వెస్టర్ల ఆసక్తితో ఐపీఎల్ మార్కెట్ విస్తరణకు ఇది నిదర్శనం.

Rajasthan Royals Set to Become IPLs First Billion Dollar Franchise: ఐపీఎల్‌లో కేవలం టైటిల్స్ మాత్రమే కాకుండా ఫ్రాంచైజీల ఆర్థిక విలువే ఇప్పుడు అసలైన సక్సెస్‌గా మారుతోంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. జైపూర్ కేంద్రంగా పనిచేసే ఈ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే ఒక బిలియన్ డాలర్లు అంటే సుమారు 9,215 కోట్ల రూపాయల మార్కును దాటిన తొలి జట్టుగా అవతరించబోతోంది. మైదానంలో ఆశించిన స్థాయిలో విజయాలు సాధించినప్పటికీ, వ్యాపారపరంగా రాజస్థాన్ రాయల్స్ విలువ అమాంతం పెరగడం విశేషం. ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్లు ఈ జట్టుపై భారీగా ఆసక్తి చూపుతూ ఉండడంతో బిలియన్ డాలర్లకుపైగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కేవలం ఒక జట్టు విజయమే కాదు, ఐపీఎల్ మార్కెట్ ఎంత వేగంగా విస్తరిస్తుందో చెప్పడానికి ఒక స్పష్టమైన ఉదాహరణ. క్రికెట్ ప్రపంచంలో ఒక బ్రాండ్ వాల్యూను ఎలా పెంచుకోవచ్చో ఈ ఫ్రాంచైజీ నిరూపిస్తోంది. త్వరలోనే ఈ డీల్ అధికారికంగా ముగిస్తే, క్రీడా రంగంలో ఇదొక సంచలనంగా మారనుంది.
