AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన సీజన్ ఏదో తెలుసా.. ఆ లక్కీ టీం ఏదంటే?

Most Expensive World Cup: 2007 నుంచి 2024 వరకు జరిగిన ప్రపంచకప్‌లో ప్రైజ్ మనీ వివరాలను ఓసారి పరిశీలిస్తే.. క్రమంగా పెరుగుతూ వస్తోంది. తొలి ప్రపంచకప్ భారత్ గెలిచినప్పుడు వచ్చిన ప్రైజ్ మనీ కేవలం రూ. 2 కోట్లు మాత్రమే. కానీ 2024లో భారత్ గెలిచినప్పుడు ఐసీసీ నుంచి సుమారు రూ. 20.42 కోట్లు లభించాయి. అంటే దాదాపు 10 రెట్లు పెరిగింది.

T20 World Cup: టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన సీజన్ ఏదో తెలుసా.. ఆ లక్కీ టీం ఏదంటే?
Most Expensive World Cup
Venkata Chari
|

Updated on: Jan 30, 2026 | 7:27 PM

Share

Most Expensive World Cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం సర్వం సిద్ధమైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఈ ఐసీసీ మెగా ఈవెంట్ కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి. అయితే, ఇప్పటి వరకు జరిగిన టీ20 ప్రపంచకప్స్ లో మోస్ట్ ఎక్స్ పెన్సివ్ ఏదో ఓసారి చూద్దాం. 2007లో మొదలైన ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఇప్పటి వరకు 9 ఎడిషన్స్ పూర్తి చేసుకుంది. 10 వ ఎడిషన్ ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానుంది. ఈ క్రమంలో యూఎస్ఏ, వెస్టిండీస్‌లో జరిగిన 2024 టీ20 ప్రపంచ కప్ అత్యధిక ప్రైజ్ మనీ రికార్డ్ తో సంచలనం స‌ృష్టించింది.

2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్ కోసం ఐసీసీ రికార్డు స్థాయిలో $11.25 మిలియన్ల బహుమతిని అందించిన సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ టీ20 ప్రపంచకప్ హిస్టరీలో 2024 అత్యంత ఖరీమైన ప్రపంచకప్‌గా స్థానం దక్కించుకుంది. ఈ మేరకు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అలార్డిస్ మాట్లాడుతూ.. “ ఈ ఈవెంట్ అనేక విధాలుగా చారిత్రాత్మకమైనది. కాబట్టి ఆటగాళ్లకు ఇచ్చే బహుమతి డబ్బు దానిని ప్రతిబింబించడం సముచితం” అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే, టోర్నమెంట్ మొదటి రౌండ్‌లో 40 మ్యాచ్‌లతో ప్రారంభమైంది. ఆ తరువాత సూపర్ 8లు జరిగాయి.

తొలి విజేత టీమిండియా నుంచి వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని సంవత్సరాలుగా నిరంతరం ఐసీసీ పెంచుతూ వస్తోంది. 2007 నుంచి గత తొమ్మిది ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ విజేతలు ఎంత గెలిచారో ఓసారి చూద్దాం..

2024లో యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ సేన సారథ్యలోకి భారత జట్టు టైటిల్‌ను గెలచుకుని $2.45 మిలియన్లు (సుమారు రూ. 20.42 కోట్లు) బహుమతిని దక్కించుకుంది.

2022లో ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ జట్టు టైటిల్‌ను గెలుచుకోని $1.6 మిలియన్ల బహుమతిని అందుకుంది.

టీ20 ప్రపంచకప్ విజేతల ప్రైజ్ మనీ (2007 – 2024)

సంవత్సరం విజేత (Winner) ప్రైజ్ మనీ (భారత కరెన్సీలో సుమారుగా) రన్నరప్ (Runner-up)
2007 భారత్ రూ. 2.00 కోట్లు పాకిస్థాన్
2009 పాకిస్థాన్ రూ. 2.90 కోట్లు శ్రీలంక
2010 ఇంగ్లాండ్ రూ. 3.40 కోట్లు ఆస్ట్రేలియా
2012 వెస్టిండీస్ రూ. 5.40 కోట్లు శ్రీలంక
2014 శ్రీలంక రూ. 6.60 కోట్లు భారత్
2016 వెస్టిండీస్ రూ. 10.60 కోట్లు ఇంగ్లాండ్
2021 ఆస్ట్రేలియా రూ. 12.00 కోట్లు న్యూజిలాండ్
2022 ఇంగ్లాండ్ రూ. 13.00 కోట్లు పాకిస్థాన్
2024 భారత్ రూ. 20.42 కోట్లు దక్షిణాఫ్రికా

2007లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి, ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన టోర్నమెంట్ లో ఒకటిగా మారింది. ఇది టీ20 క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రజాదరణ పొందిందో చూపిస్తుంది.

2026లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ క్రికెట్ అభిమానులకు ఫుల్ మజాను ఇవ్వనుంది. 2024లో విజేత జట్టుకు $2.45 మిలియన్లు (సుమారు రూ. 20.42 కోట్లు) సొంతం చేసుకోగా, 2026లో ఛాంపియన్‌గా నిలిచే జట్టు ఏకంగా $3 మిలియన్ల (సుమారు రూ. 27.48 కోట్లు) నగదును దక్కించుకోనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..