AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli : నేను చేసిన ఆ రెండు సినిమాలు అతడు తప్ప ఎవరు చేయలేరు.. డైరెక్టర్ రాజమౌళి..

డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న వారణాసి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. ఈక్రమంలో గతంలో జక్కన్న ఓ హీరోపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు అదే కామెంట్స్ మరోసారి తెరపైకి వచ్చాయి.

Rajamouli : నేను చేసిన ఆ రెండు సినిమాలు అతడు తప్ప ఎవరు చేయలేరు.. డైరెక్టర్ రాజమౌళి..
Rajamouli
Rajitha Chanti
|

Updated on: Jan 31, 2026 | 9:35 PM

Share

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం వారణాసి చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓ హీరోపై రాజమౌళి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. తాను తెరకెక్కించిన సింహాద్రి, యమదొంగ సినిమాలను జూనియర్ ఎన్టీఆర్ తప్ప మరో హీరో చేయలేరని అన్నారు. ఎన్టీఆర్‌కు తనపై అపారమైన నమ్మకం ఉందని, ఆయన కథను కూడా అడగకుండా తన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని రాజమౌళి తెలిపారు. తనకు నచ్చినట్టుగా కథ రాసుకునే స్వేచ్ఛను అది కల్పించిందని అన్నారు. తాను ఎప్పుడూ పెద్దగానే ఆలోచిస్తానని, నిర్మాతలు కూడా పెద్ద చిత్రాల కోసమే తనను సంప్రదిస్తారని చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

రాజమౌళి “ఫ్రీ మూవీస్ ఎన్టీఆర్‌తోటే తీశారు కదా. సో ఆయనకు ఒక పెద్ద బ్రేక్” అని పేర్కొన్నారు. అయితే, దీనిపై వివరణ ఇస్తూ.. “బ్రేక్ ఇస్ నాట్ ద రైట్ వర్డ్” అని, ఎన్టీఆర్. తాను ఒకరికొకరు విజయాన్ని అందించుకున్నారని స్పష్టం చేశారు. సింహాద్రి, యమదొంగ వంటి చిత్రాలను ప్రస్తావిస్తూ, ఎన్టీఆర్ తప్ప మరే ఇతర నటుడు ఆ పాత్రలకు న్యాయం చేయలేరని, అలాంటి నటుడిని ఊహించుకోవడం కూడా కష్టమని రాజమౌళి అన్నారు. ఈ సహకారం తమ ఇద్దరికీ విజయానికి దారితీసిందని వివరించారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రిలేషన్షిప్, నేను సినిమా అంటే కథ కూడా అడగడు. కథ చెప్తా అంటే, ఆ మీరే చూసుకోండి, నాకెందుకు కథ చెప్పాలి అంటాడు అని రాజమౌళి నవ్వుతూ చెప్పారు. ఇది తనపై ఎన్టీఆర్‌కు ఉన్న అపారమైన నమ్మకాన్ని, గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని రాజమౌళి తెలిపారు. ఈ నమ్మకం కారణంగా, రాజమౌళి స్వేచ్ఛగా తనకిష్టమైన విధంగా సన్నివేశాలను రూపొందించుకోగలనని, ఎన్టీఆర్ వాటిని చేయగలడా లేదా అనే సందేహం తనకు ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. “జక్కన్న” అనే ముద్దుపేరు గురించి అడిగినప్పుడు, అది తనకు అలవాటైపోయిందని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

Rajamouli, Jrntr

Rajamouli, Jrntr

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..

సినిమా బడ్జెట్ విషయానికి వస్తే, రాజమౌళి తన ఆలోచనలు ఎప్పుడూ పెద్దగానే ఉంటాయని వివరించారు. “నా సినిమా వరకు ఐ ఆల్వేస్ థింక్ బిగ్” అని ఆయన అన్నారు. తన వద్దకు వచ్చే నిర్మాతలు కూడా భారీ చిత్రాలనే కోరుకుంటారని, ఆలోచనలు కలిసినప్పుడే బడ్జెట్ కూడా పెద్దదిగా ఉంటుందని చెప్పారు. అయితే, భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ, అది సినిమా వ్యాపార పరిధికి లోబడే ఉండాలని, లాభదాయకతను దృష్టిలో ఉంచుకోవాలని రాజమౌళి చెప్పారు. “సినిమాకి బిజినెస్ ఎంత అవుద్దో ఆ లోపే చేయాలి. అది చేయకపోతే ఇట్స్ నాట్ ఏ గుడ్ బిజినెస్” అని ఆయన తన ఆర్థిక క్రమశిక్షణను తెలియజేశారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..