Tollywood : టార్గెట్ 1000 కోట్లపై మాటే.. పెద్ద కష్టేమేమి కాదంటున్న బడా హీరోలు
1000 కోట్లు అంటే ఒకప్పుడు అద్భుతం.. కానీ ఇప్పుడు అనుకుంటే ఆరంటే ఆరే రోజుల్లో వచ్చే వసూళ్లు. అంత ఈజీ అయిపోయింది మన వాళ్లకు థౌజెండ్ వాలా పేల్చడం. మరి ఇండియన్ స్క్రీన్‌పై నెక్ట్స్ 1000 కోట్లు వసూలు చేసే సినిమా ఏది..? అది కూడా మళ్లీ సౌత్‌కే సాధ్యమా..? ధురంధర్‌లా బాలీవుడ్ నుంచి మేమున్నాం అంటూ ఎవరైనా వస్తున్నారా..? చూద్దామా

రెండేళ్ల కింద పుష్ప 2కు వచ్చిన వసూళ్లు చూసాక.. 1000 కోట్లు ఇంత ఈజీనా అనిపించింది. ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు.. ఫుల్ రన్‌లో 1700 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనికి ముందు బాహుబలి 2, కేజియఫ్ 2, RRR, జవాన్, పఠాన్, కల్కి సినిమాలు మాత్రమే 1000 కోట్లు దాటాయి. పుష్ప 2 తర్వాత ధురంధర్ 2025లో 1000 కోట్ల రికార్డ్ అందుకుంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాల్లో బాలీవుడ్ నుంచి కేవలం ధురంధర్ 2కు మాత్రమే 1000 కోట్ల క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉంది. ఫస్ట్ పార్ట్ సృష్టించిన సంచలనం చూసాక.. రెండో పార్ట్‌కు 1000 కోట్లు పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ఏ మాత్రం టాక్ బాగున్నా ధురంధర్ 2 ఈజీగా 2000 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా. అలాగే మార్చి 19న ధురంధర్ 2కు పోటీగా వస్తున్న టాక్సిక్ కూడా 1000 కోట్ల రేసులో ఉంది.
టీజర్‌తోనే టాక్సిక్ రేంజ్ అర్థమైపోయింది. కంటెంట్ ఏ మాత్రం క్లిక్ అయినా.. కేజియఫ్ రికార్డుల్ని ఈజీగా తుడిచిపెట్టేలా ఉన్నారు యశ్. థౌజెండ్ వాలా రేసులో ముందున్నది సౌత్ ఇండస్ట్రీనే. ప్రభాస్ ఫౌజీతో పాటు స్పిరిట్ సినిమాకి కూడా 1000 కోట్ల ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్.. రామ్ చరణ్ పెద్ది రేంజ్ తక్కువేం కాదు.. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్.. వారణాసి ఎలాగూ ఉండనే ఉంది.
తమిళం నుంచి 1000 కోట్ల సినిమా ఇప్పట్లో రావడం కష్టమే. మూడేళ్ళ కింద జైలర్ 600 కోట్ల దగ్గరే ఆగింది.. పార్ట్ 2 హిట్టైతే 1000 కోట్లు కష్టమేం కాకపోవచ్చు. అలాగే విజయ్ చివరి సినిమా జన నాయగన్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మొత్తానికి అంచనాలు అందుకుంటే ఈ మూడు నాలుగు సినిమాలకు థౌజెండ్ వాలా పేల్చే ఛాన్స్ ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




