బుట్టబొమ్మ ఫోకస్ ఇప్పుడు అక్కడే.. హిట్టు కోసం పూజా నయా ప్లాన్..

Rajitha Chanti

Pic credit - Instagram

13 February 2026

పాన్ ఇండియా లెవల్లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది హీరోయిన్ పూజా హెగ్డే. తెలుగు, హిందీ, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే కొన్నా్ళ్లుగా ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. ఇటీవల తెలుగు, తమిళంలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. 

అయితే వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూజా.. ఇప్పుడు తన కెరీర్‌లో వచ్చిన ఈ మలుపును ఒక బ్రేక్ లాగా కాకుండా దానిని రీసెట్ బటన్ లాగా తీసుకుందట.

అయితే పూజా హెగ్డే భారీ పారితోషికం కారణంగానే పలు ప్రాజెక్ట్స్ మిస్సైందనే టాక్ వినిపిస్తుంది. ఆమె రెమ్యునరేషన్ పలు చిత్రాలకు అడ్డంకిగా మారిందట.

మరోవైపు పూజా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో పూజాకు టాలీవుడ్‌లో గ్యాప్ ఏర్పడింది. దీంతో ఇప్పుడు తెలుగుపై ఫోకస్ చేసిందట. 

తెలుగులో మరోసారి బిజీ అయ్యేందుకు ప్లాన్ చేస్తుందట పూజా మళ్లీ ఇక్కడ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది

రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మను తెలుగులో రెండు సినిమాల‌ కోసం సంప్రదించినట్టు స‌మాచారం. దీంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ విషయంలో వెనక్కు తగ్గిందట. 

త్వరలోనే తెలుగులో రెండు సినిమాలతో ఈ ముద్దుగుమ్మ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.