మూడు వారాల్లోనే 3 కిలోల బరువు తగ్గిన జెనీలియా.. ఏం చేసిందంటే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

13 February 2026

భారతీయ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు జెనీలియా. తెలుగు, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది.

హిందీ హీరో రితేశ్ దేశ్ ముఖ్ తో ప్రేమ, పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. చాలా కాలం తర్వాత ఇటీవల వేద్ సినిమాతో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. 

తాజాగా తన వెయిట్ లాస్ సీక్రెట్ బయటపెట్టింది. కేవలం మూడు వారాల్లోనే 4 కిలోల వరకు బరువు తగ్గానని.. అందుకు గల కారణాలు వెల్లడించింది.

రోజూ కఠినమైన వ్యాయమాలు, ఇంట్లో చేసిన పదార్థాలు మాత్రమే తీసుకుంటుదట. అలాగే ఎక్కువగా వాటర్ కంటెంట్ ఆహారం తీసుకుంటానని తెలిపింది ఈ బ్యూటీ. 

 జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ ప్రేమకథ 2002లో వారి తొలి చిత్రం 'తుఝే మేరీ కసమ్' సెట్‌లలో ప్రారంభమైంది.ఆ స్నేహం త్వరలోనే ప్రేమగా మారింది.

 దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి గడిపిన తర్వాత, వారు 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి రియాన్, రహిల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇటీవలే వేద్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ అనే మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

మరోవైపు తెలుగులోనూ సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఇటీవల జూనియర్ మూవీతో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలకపోయింది.