Astrology 2026: ప్రతికూలంగా రాహువు.. ఆ రాశుల వారు ఆస్తి, డబ్బు విషయాల్లో జాగ్రత్త
కుంభ రాశిలో రాహువు సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మోసాలు, నమ్మక ద్రోహాలు, ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారు బంధుమిత్రులతో, ఆర్థిక లావాదేవీలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. జూన్ తర్వాత మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆస్తి, డబ్బు వ్యవహారాల్లో మోసపోకుండా చూడాలి.

Rahu Transit Impact
జ్యోతిషశాస్త్రం ప్రకారం మోసాలకు, నమ్మక ద్రోహాలకు, వంచనలకు రాహువు కారకుడు. ఈ వక్ర గ్రహం ఏమాత్రం ప్రతికూలంగా ఉన్నా బాగా నమ్మకస్తులు, విధేయులు, సన్నిహితులు సైతం మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కుంభ రాశిలో సంచారం చేస్తున్న రాహువు కొన్ని రాశులవారిని వంచించే అవకాశం ఉంది. కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారు కొత్తవారితోనే కాక, బంధుమిత్రులతో, సన్నిహితులతో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. బాగా డబ్బు నష్టపోయే లేదా మోసపోయే అవకాశం ఉంది. జూన్ తర్వాత మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది.
- కర్కాటకం: ఈ రాశికి రాహువు అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారిని ఎవరైనా తేలికగా మోసపోయే అవకాశం ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో బంధువుల వల్ల, ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో మిత్రుల వల్ల భారీగా మోసపోయే అవకాశం ఉంది. డబ్బు తీసుకున్నవారు ఇవ్వకపోవడం, ముఖం చాటేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. అష్టమ రాహువు వల్ల భోళాతనం పెరిగి, మాయమాటలను తేలికగా నమ్మడం జరుగుతుంది.
- సింహం: ఈ రాశివారు ఈ ఏడాది ఒకటికి రెండుసార్లు భారీగా మోసపోయే అవకాశం ఉంటుంది. వీరిది పొగడ్తలకు లొంగిపోయే తత్వం అయినందువల్ల బంధుమిత్రులు ఆర్థికంగా మోసగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో డబ్బు నష్టం ఎక్కువగా ఉంటుంది. పని చేయించుకున్నవారు పారితోషికం చెల్లించని పరిస్థితి కూడా ఉంటుంది. డబ్బు తీసుకోవడమే తప్ప ఇవ్వడం ఉండదు. మొండి బాకీల సంఖ్య పెరుగుతుంది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది.
- వృశ్చికం: ఈ రాశికి నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల ఈ రాశివారు అనేక విధాలుగా మోసపోయే అవకాశం ఉంది. బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల కూడా నష్టపోవడం, మోసపో వడం వంటివి జరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆస్తి వివా దాల్లో బంధువుల వల్ల దెబ్బతినడం జరుగుతుంది. సొంత ఇంటి నిర్మాణంలో ఖర్చులు రెట్టింప వుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రలోభాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
- కుంభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాహువు వల్ల ఈ రాశివారు దాదాపు ప్రతి విషయంలోనూ మోస పోవడం లేదా నష్టపోవడం జరుగుతుంటుంది. ఆస్తిపాస్తుల క్రయ విక్రయాల్లో భారీగా మోసపోయే అవకాశం ఉంది. గృహ నిర్మాణ వ్యవహారాల్లో లేదా ఇల్లు కొనే ప్రయత్నాల్లో మధ్యవర్తుల వల్ల డబ్బు నష్టం కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావచ్చు. స్థలం గానీ, పొలం గానీ కబ్జాకు గురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం చాలా మంచిది.
- మీనం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారు నమ్మకద్రోహానికి, వంచనకు బాగా గురయ్యే అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ ఏడాదంతా ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. రహస్య శత్రువులు తయారవుతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో బంధువులు తప్పుదారి పట్టించడం జరుగుతుంది. డబ్బు ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ పెట్టుకోవద్దు. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందదు. మొండి బాకీలు ఎక్కువగా ఉంటాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.