Weekly Horoscope: వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (జనవరి 4-10, 2026): మేష రాశి వారికి ఈ వారమంతా ఉత్సాహంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిథున రాశి వారికి ఈ వారమంతా సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Weekly Horoscope 04 Jan 2026 10 Jan 2026
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, రవి, రాహు, శుక్రుల అనుకూలత వల్ల ఆశించిన శుభవార్తలు వింటారు. వారమంతా ఉత్సాహంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు తిరుగుండదు. ప్రయత్న లోపం ఉండని పక్షంలో ఆదాయ వృద్ధికి ఎంతో అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల్ని కలుపుకుని వెళ్లడం మంచిది. పట్టుదలగా పనులన్నీ పూర్తి చేస్తారు. వినోద యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆస్తిపరంగా రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ధన స్థానంలో గురువు, లాభస్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఏదో విధంగా ముఖ్యమైన వ్యవ హారాలు, పనులను పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, చేతిలో డబ్బు మిగలకపోవచ్చు. ఆస్తి వివాదం విషయంలో సోదరులతో రాజీ మార్గం అనుసరిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. వారమంతా సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పెండింగ్ పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మాట చెల్లుబాటు అవుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకో కుండా పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): రాశ్యధిపతి చంద్రుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా అనుకూలంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు గడిస్తారు. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సామరస్యం బాగా పెరుగుతాయి.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి మిత్ర గ్రహాలతో మిత్ర రాశిలో కలిసి ఉండడం వల్ల ఈ వారమంతా విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న బంధువులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయానికి లోటుండదు. ఆర్థికంగా అదృష్టం పట్టే సూచనలున్నాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. స్నేహితులతో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. కొద్ది ప్రయత్నంతో విద్యార్థులు దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా సాగిపోతాయి.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): దశమ స్థానంలో గురువుతో రాశ్యధిపతి బుధుడికి పరివర్తన జరిగినందువల్ల ఊహించని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. అను కోకుండా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. బంధువులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి, పని భారం నుంచి బయటపడతారు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త వింటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): భాగ్య స్థానంలో గురువు, తృతీయ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు పరస్పరం వీక్షించుకోవడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, మీ చేతకు తిరుగుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ప్రయాణాల వల్ల లాభాలుంటాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. మిత్రులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిల కడగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ధన స్థానంలో రాశ్యధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహాల సంచారం వల్ల ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. కెరీర్ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి కాస్తంత ఒత్తిడి కలిగిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రవి, గురు, శుక్రులు అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్న కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరం గానే కాకుండా ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. బంధు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. శుభ కార్యంలో పాల్గొంటారు. ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెంచడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగం మారేందుకు ప్రయత్నాలు చేయడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): గురువు షష్ట స్థానంలో ఉండడం, వ్యయ స్థానంలో నాలుగు గ్రహాలు యుతి చెందడం వల్ల వార మంతా కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తులవారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ, అత్యవసరమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా గడిచిపోతాయి.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఏలిన్నాటి శని నడుస్తున్నప్పటికీ, ఇతర గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తులవారికి మంచి అవకాశాలు అందివస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపి స్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు చదువుల్లో దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): చతుర్థ స్థానంలో రాశ్యధిపతి గురువు, దశమ స్థానంలో నాలుగు గ్రహాల యుతి వల్ల వారమంతా ప్రశాంతంగా, హాయిగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు కోరికలు, ఆశలు నెరవేరుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టమైన బంధువులు చూడడానికి వస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది. చదువుల్లో పిల్లలు విజయాలు సాధిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి.











