రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్లో భారీ ఎమోషన్, ఊరమాస్ యాక్షన్ హైలైట్‌గా నిలిచాయి. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా మూడు క్రీడల్లో ప్రతిభ చూపించే పెద్ది పాత్రలో చరణ్ అదరగొట్టారు. తన ఊరి గౌరవం కోసం జాతీయ స్థాయిలో పోరాడే అండర్డాగ్ కథగా సినిమా కనిపిస్తోంది. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ ట్రైలర్లో చరణ్ రగ్గడ్ లుక్, డైలాగ్స్, ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.