Bandi Sanjay: మున్సిపల్ పీఠాన్ని బీజేపీకి ఇవ్వండి.. జమ్మికుంట అభివృద్ధికి బాటలు వేయండి- బండి సంజయ్
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ప్రభుత్దవం ఇచ్చింది గాడిద గుడ్డేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. పొరపాటున కాంగ్రెస్ ను గెలిపిస్తే ఇంటి పన్ను, నల్లా పన్ను, వ్యాపార పన్నుల పెంపు ఖాయమని చెప్పారు. ఖజానా కోసం రోడ్డు మీద నడవాలంటే కూడా ట్యాక్స్ వేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నయాపైసా లేదని, బీజేపీకి మున్సిపాలిటీలను అప్పగిస్తే పన్నుల్లేకుండా ఢిల్లీ నుండి నిధులు తెచ్చి అభివ్రుద్ది చేస్తామని భరోసా ఇచ్చారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంద్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మికుంట పట్టణం ఏళ్ల తరబడి ఇలానే ఉంది. అభివృద్ధి చెస్తాయని, కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. ఆ పార్టీలు పట్టణాన్ని గాలికొదిలేశాయి. వాళ్లు ఓట్లు వేయించుకున్నారే తప్ప నయాపైసా అభివ్రుద్ది చేయలేదు. బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ కు ఓట్లేసినా చిల్లిగవ్వ రాలేదు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించారు. మేం వెంటనే ప్రధాని వద్దకు పోయి పంచాయతీలకు రూ.259 కోట్లు తీసుకొచ్చామన్నారు.
జమ్మికుంట మున్సిపాలిటీలో బీజేపీ గెలవకపోయినా పెద్ద ఎత్తున కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చామని.. 14, 15వ ఆర్ధిక సంఘం ద్వారా 8 కోట్ల 23 లక్షలు, అమ్రుత్ ద్వారా 33 కోట్లు, స్వనిధి ద్వారా 4వేల 587 మందికి 8 కోట్ల 45 లక్షలు ఇచ్చాం అన్నారు. మొన్ననే ఖేలో ఇండియా ద్వారా సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం కోసం 6 కోట్ల 50 లక్షలు మంజూరు చేయించామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే పిల్లలందరికీ ఉచితంగా సైకిళ్లు ఇచ్చామన్నారు. పరీక్ష ఫీజు చెల్లించామ్నారు.
సీఎస్సార్, ఎంపీ లాడ్స్ నిధులతో కోట్ల రూపాయలు తీసుకొచ్చి జమ్మికుంట ఆసుపత్రికి రెండు కోట్లతో మెడికల్ ఎక్విప్ మెంట్స్ తీసుకొచ్చామన్నారు. కానీ హాస్పిటల్‌లో మాత్రం డాక్టర్లు, ఆశించిన సిబ్బంది కరువయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని.. మున్సిపాలిటీలు ఈ రోజు అభివృద్ది బాటలో నడుస్తున్నాయంటే అది ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నుంచి వచ్చిన నిధులతోనేనని ఆయన అన్నారు.
బీజేపీకి చైర్మన్ పీఠం అప్పగిస్తే జమ్మికుంటలోని నాయిని చెరువును రిజర్వాయర్ చేసి బోటింగ్ (పడవ ప్రయాణం) ఏర్పాటు చేస్తామని.. అహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అద్బుతంగా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటానని.. జమ్మికుంట ప్రజల ఆస్తులకు విలువ పెరిగేలా చేస్తానని ఆయన అన్నారు. జమ్మికుంట వ్యాపార కేంద్రమైనప్పటికీ కొంతమంది పట్టణంలో భూలక్ష్మి, మహాలక్ష్మి (బొడ్రాయి) లేనందుకు వ్యాపారాలు దెబ్బతింటున్నాయని బాధపడుతున్నారు. మాకు మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాన్ని అప్పగిస్తే బొడ్రాయిని ఏర్పాటు చేసే బాధ్యత మాది అన్నారు.
జమ్మికుంట రైల్వే స్టేషన్ ను కరీంనగర్ మాదిరిగా అద్బుతంగా ఆధునీకరిస్తా. ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్ సహా అన్ని సదుపాయాలు కల్పిస్తా. జమ్మికుంటను వ్యాపార, కూరగాయల హబ్‌గా మారుస్తామని.. పట్టణంలో రెంట్‌కు ఉండి, ఇల్లు లేకుండా నివాసం ఉంటున్న వారి ఇంట్లో మరణం సంభవిస్తే పెద్దకర్మ నిర్వహించే వరకు సముదాయం (గృహం) నిర్మించి కార్యక్రమాలు జరిపించేలా కృషి చేస్తామని.. జమ్మికుంట పట్టణంలోని అన్ని వార్డులలో ఇంటర్నల్ రోడ్లు నిర్మించి సీసీ కెమెరా ఏర్పాటు చేస్తామన్నారు.
లోతట్టు ప్రాంతాలలో(హౌసింగ్ బోర్డ్, అంబేద్కర్ కాలనీ, కృష్ణ కాలనీ ఏరియాలో) మురికి నీరు కాల్వ ప్రాబ్లం లేకుండా ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి చేస్తామని. జమ్మికుంటను సుందర పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు .కేంద్ర నిధులు తీసుకొచ్చి అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తామని. పీఎం ఆవాస్ యోజన నిధులు తెచ్చి పేదలందరికీ ఇండ్లు ఇప్పించేందుకు క్రుషి చేస్తామన్నారు. అందుకే మంచి పాలన కోసం ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని.. జమ్మికుంటను అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
