AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎన్నికల బరిలోకి కేసీఆర్ కూతురు.. సింహం గుర్తుతోరంగంలోకి.. పోటీ ఎక్కడినుంచంటే?

భారత రాష్ట్ర సమితితో తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కేసీర్ కుమార్తె కవిత వచ్చే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.అయితే తన సొంత రాజకీయ పార్టీ అయిన జాగ్రృతి పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో.. ఈ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిపి పోటీ చేసేలా ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నారు. అన్ని సెట్‌ అయితే ఈ పార్టీ గుర్తుపైనే కవిత ఎన్నికల బరిలోకి దిగనున్నారు.

Telangana: ఎన్నికల బరిలోకి కేసీఆర్ కూతురు.. సింహం గుర్తుతోరంగంలోకి.. పోటీ ఎక్కడినుంచంటే?
Kavitha Municipal Elections
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Jan 24, 2026 | 2:31 PM

Share

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సింహం గుర్తు ఎప్పటినుంచో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలన్న, ఏదైనా పార్టీ రెబల్గా పోటీ చేయాలన్న ఈ సింహం గుర్తుపై చాలామంది ఆధారపడతారు. గతంలో మంత్రి జూపల్లి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తిరుగుబాటు జెండా ఎగరవేసి కొల్లాపూర్ మున్సిపాలిటీలో మెజార్టీ సీట్లు సాధించారు. సింహం గుర్తు ప్రజల్లో ఆకట్టుకునే లాగా ఉండడంతో పాటు… రెబల్ లుక్ ఇవ్వడం, ఈజీ సింబల్ కావడంతో ప్రజలు త్వరగా ఆకర్షితులవుతారు. గత రెండు దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల్లో ఈ సింహం గుర్తు ప్రధాన పార్టీలతో పాటు కనిపిస్తూ వస్తుంది.

అందుకే కవిత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ మున్సిపల్ ఎన్నికల వరకు ఫార్వర్డ్ బ్లాక్ బీ ఫార్మ్‌లతో జాగృతి అభ్యర్థులు పోటీ చేయనున్నట్టు తెలుస్తొంది. ఎన్నికల జరుగుతున్న అన్ని మున్సిపాలిటీలోనూ జాగృతి పోటీ చేయనున్నట్లు సమాచారం. జాగృతి పార్టీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ కావడానికి ఇంకొక నాలుగు ఐదు నెలల సమయం పడుతుంది. ఈనెల 27న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో అంత సమయం లేనందున సింహం గుర్తుతో పోటీకి దిగాలని కవిత నిర్ణయించుకున్నారు.

అయితే సింహం గుర్తుతో పోటీ చేయనున్న కవిత అభ్యర్థులు ఎవరి ఓట్లను మింగేయనున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇది ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను చీలుస్తుందా.. లేక అధికార పార్టీ ఓట్లను కొళ్లగొడుతుంతా అనేది సస్పెన్స్‌గా మారింది. మున్సిపల్ ఎన్నికల బరిలో అటు జాగృతి అభ్యర్థులు కూడా పోటీ చేయడంతో దీనిపై ఇటు గులాబీ పార్టీలో కూడా తీవ్ర చర్చ జరుగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రతిరోజు ఉదయం ఈ 4 పనులు చేస్తే అందమైన, మృదువైన చర్మం మీ సొంతం!
ప్రతిరోజు ఉదయం ఈ 4 పనులు చేస్తే అందమైన, మృదువైన చర్మం మీ సొంతం!
పుట్టగొడుగులు అందరికీ సేఫ్ కావు! ఎవరు తినకూడదు తెలుసా?
పుట్టగొడుగులు అందరికీ సేఫ్ కావు! ఎవరు తినకూడదు తెలుసా?
అందంలో చందమామ.. చీరకట్టులో కుందనపు బొమ్మ..
అందంలో చందమామ.. చీరకట్టులో కుందనపు బొమ్మ..
క్రెడిట్ కార్డు బిల్ కట్టలేక నెత్తి కొట్టుకుంటున్నారా.. ఈ టిప్స్
క్రెడిట్ కార్డు బిల్ కట్టలేక నెత్తి కొట్టుకుంటున్నారా.. ఈ టిప్స్
అటువంటి నటన నా జీవితంలో చూడలేదు: యాక్టర్ శత్రు
అటువంటి నటన నా జీవితంలో చూడలేదు: యాక్టర్ శత్రు
పెళ్లిలో రస్‌గుల్లా ఆట..! భలే క్యాచ్‌పట్టిన వధువు.. ఫన్నీ వీడియో
పెళ్లిలో రస్‌గుల్లా ఆట..! భలే క్యాచ్‌పట్టిన వధువు.. ఫన్నీ వీడియో
మళ్లీ రెచ్చిపోయిన హార్దిక్..ఈసారి ఏకంగా టీవీ కామెంటేటర్ మీదే
మళ్లీ రెచ్చిపోయిన హార్దిక్..ఈసారి ఏకంగా టీవీ కామెంటేటర్ మీదే
హోమ్ లోన్ తీసుకునే ముందు ఇవి పక్కా తెలుసుకోండి.. ఇలా చేస్తే మీకు
హోమ్ లోన్ తీసుకునే ముందు ఇవి పక్కా తెలుసుకోండి.. ఇలా చేస్తే మీకు
టోన్డ్ మిల్క్ లేదా నార్మల్ మిల్క్... ఏది బెటర్? నిపుణుల మాట ఇదే
టోన్డ్ మిల్క్ లేదా నార్మల్ మిల్క్... ఏది బెటర్? నిపుణుల మాట ఇదే
కొబ్బరి లేకుండా కొబ్బరి చట్నీ తయారు చేయోచ్చని తెలుసా..
కొబ్బరి లేకుండా కొబ్బరి చట్నీ తయారు చేయోచ్చని తెలుసా..